టీడీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు చంద్రబాబుకు షాక్ ఇచ్చి, జగన్‌కు జై కొట్టిన విషయం తెలిసిందే. డైరక్ట్‌గా వైసీపీలోకి వెళితే పదవులకు రాజీనామా చేయాల్సి వస్తుందని చెప్పి, పార్టీలో చేరకుండా ప్రభుత్వానికి మద్ధతు తెలుపుతున్నారు. అంటే అనధికారికంగా వైసీపీ ఎమ్మెల్యేలుగా నడుచుకుంటున్నారు. వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం, వాసుపల్లి గణేశ్ కుమార్‌లు ప్రస్తుతం వైసీపీ మద్ధతుదారులుగా ఉన్నారు.

అయితే త్వరలో మరికొందరు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా వైసీపీ వైపు వెళ్ళే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ విషయం పక్కనపెడితే టీడీపీని వీడిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళ్ళే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. ఎందుకంటే త్వరలోనే తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ చనిపోవడంతో, తిరుపతిలో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ ఉపఎన్నికలో అన్నీ పార్టీలు పోటీ చేయనున్నాయి.

ఎన్ని పార్టీలు బరిలో ఉన్నా ప్రధాన పోటీ వైసీపీ, టీడీపీల మధ్యే ఉండనుంది. అయితే అధికారంలో ఉన్న వైసీపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పైగా తిరుపతిలో టీడీపీకి పెద్ద రికార్డు లేదు. ఇక తిరుపతిలో గెలిచాక, టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి, మళ్ళీ ఉపఎన్నికలకు వెళ్ళే అవకాశముందని తెలుస్తోంది. అప్పుడు వైసీపీకి ఇంకాస్త కాన్ఫిడెన్స్ పెరుగుతుందని విశ్లేషుకులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతానికైతే నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ వైపు ఉన్నారు.

ఇక ఈ నలుగురులో గెలుపు గుర్రం ఎక్కేది ఎవరనే చర్చ కూడా వస్తుంది. అవి టీడీపీ స్థానలైన సరే వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి, గెలుపు ఆ పార్టీ వైపు ఉంటుంది. పైగా ఎమ్మెల్యేలకు వ్యక్తిగత ఇమేజ్ కూడా ఉంది. వంశీ, కరణం, వాసుపల్లిలకు సొంత ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. కాబట్టి వారి గెలుపు సులువే. అలాగే మద్దాలి గిరికి సొంత సామాజికవర్గం సపోర్ట్ ఉంది. కాకపోతే మద్దాలి రాజధాని అమరావతికి దగ్గర ఉండే గుంటూరు స్థానం నుంచి పోటీ చేస్తారు కాబట్టి, అక్కడ పరిస్థితిలని బట్టి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: