ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సీఎం జగన్ తప్పు చేస్తున్నారా...? అంటే అవుననే సమాధానం వినబడుతోంది. తెలుగుదేశం పార్టీ నేతలు కొంతమంది మాట్లాడుతున్న సమయంలో సీఎం జగన్ లో ఎక్కువగా సీరియస్ గా కనబడుతుంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నాలుగు రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ నేతలను వరుసగా సస్పెండ్ చేస్తూ వస్తున్నారు. దీని వలన అధికార పార్టీ ఇబ్బంది పడుతుంది అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతోంది. చంద్రబాబు నాయుడు పట్టుదల గల వ్యక్తి కావడంతో సీఎం జగన్ పై 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సరే ఎక్కువగా పోరాటం చేస్తూ వస్తున్నారు.

రాజకీయ పరిణామాలు అన్నీ కూడా ఇప్పుడు ఆసక్తికరంగా ఉన్నాయి. అనవసరంగా సస్పెండ్ చేస్తున్నారని దీనివల్ల తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పరిస్థితులు మారుతున్నాయి అని అంటున్నారు. సస్పెండ్ చేయకుండా ఉండటమే మంచిది అని శాసనసభలోనే వారికి సమాధానం చెప్పాల్సి ఉండగా అనవసరంగా సస్పెండ్ చేసి మీడియా ముందు మంత్రులతో తిట్టిస్తే అనవసరంగా ఉపయోగాలు ఉండవు అనే భావన లో చాలామంది ఉన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి ఎలాంటి అవకాశాలు లేకపోయినా ఆ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తూ తనకు అవకాశాలు సృష్టించుకునే ప్రయత్నాలను ఎక్కువ చేస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించ వలసిన అవసరం అనేది ఉంది.

అనవసరంగా ఇప్పుడు సస్పెండ్ చేస్తే వారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టంగా అర్థం అవుతుంది. కాబట్టి సస్పెండ్ చేయకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్లి తెలుగుదేశం పార్టీ చేసిన ఆరోపణలను సమర్థవంతంగా విషయ పరిజ్ఞానం ఉన్న మంత్రులతో తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించి పార్టీ నేతలు కూడా సీఎం జగన్ కి కొన్ని సూచనలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. టిడిపి కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా విడుదల అవుతున్నాయి. నేటితో శాసనసభ సమావేశాలు ముగియనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: