ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అప్పుల విషయంలో కాస్త ఇబ్బంది పడుతున్నారు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. రాజకీయంగా ఎంతో బలంగా ఉన్న ముఖ్యమంత్రి... రాష్ట్ర ప్రభుత్వం క్రమంగా అప్పులు చేయడంతో ఇప్పుడు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో కి వెళ్ళిపోయారు అనే మాట వాస్తవం. ఆంధ్రప్రదేశ్ లో అప్పులు రోజురోజుకీ పెరగడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద కనపడకుండా భారం పడుతోంది. ఆయన పరిపాలన విషయంలో ఎంత సీరియస్గా ముందుకు వెళ్తున్న సరే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రాకపోవడం ఇప్పుడు కాస్త ఇబ్బందికి గురి చేసే అంశం గా చెప్పుకోవాలి.

అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇటీవల ప్రజల మీద భారం మోపుతున్నారని ఆరోపణలు వినపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కుక్కల మీద కూడా పన్ను వేయడంపై కూడా ఆగ్రహం వ్యక్తం అవుతుంది. అంతేకాకుండా పెట్రోల్ ధరలు కూడా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉన్నాయి. టోల్ టాక్స్ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే సంచలన నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ పరిణామాలన్నీ కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ప్రజలకు దూరం చేస్తున్నాయని అంటున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల పేరిట భారీగా ప్రజలకు సీఎం జగన్ కానుకలు ఇస్తున్నారు.

అయితే ప్రజల నుంచి భారీగా వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా సరే పెద్దగా ఫలితం కనపడడం లేదని అంటున్నారు. ఎప్పటికప్పుడు కొత్త పన్నులతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ముందుకు వస్తోంది. దీని కారణంగా ప్రజల్లోకి సంక్షేమ కార్యక్రమాలు  వెళ్ళినా ఎలాంటి ఫలితం లేదు అనే భావన రాజకీయ వర్గాలు కూడా వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటకు రావాలి అంటే కొన్ని సంక్షేమ కార్యక్రమాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి భవిష్యత్తులో జగన్ ఏం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: