అనంతపురం జిల్లా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కొన్ని ప్రాంతాల మీద ప్రజలలో ఆసక్తి నెలకొంది. అలా ముఖ్యంగా చెప్పుకోవలసిన పట్టణం ఏదైనా ఉందంటే అది హిందూపురం అని చెప్పక తప్పదు. సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సొంత బావమరిది బాలకృష్ణ ఇక్కడ ఎమ్మెల్యే కావడం దానికి ఒక కారణం అని చెప్పవచ్చు. అయితే హిందూపురంలో మునిసిపల్ ఎన్నికలు అన్ని ప్రధాన పార్టీలలోనూ టెన్షన్ గానే ఉన్నాయని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఇక్కడి మున్సిపాలిటీని ఎలా అయినా కైవసం చేసుకుని గెలుపు జెండా ఎగురవేయాలని అధికారం వైసిపి ఒక పక్క తహతహలాడుతున్నా సరే వారికి రెబెల్స్ బెడద అధికంగానే ఉంది. మరో పక్క తెలుగుదేశం ఇప్పటికే అన్ని వార్డుల్లో అభ్యర్థులు ఖరారు చేసిన చివరి వరకు ఎవరు ఉంటారు ? బెదిరింపులకు భయపడి ఎవరూ తప్పు ఉంటారు అనేది మాత్రం తెలియడం లేదు. 

ఇక మిగిలిన పార్టీల వారు కూడా పూర్తి స్థాయిలో అభ్యర్థులను కాకపోయినా బలమున్న వార్డులలో సైతం తమ ప్రాబల్యాన్ని చాటుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే హిందూపురం వైసీపీ నుంచి ఏకంగా 170 తొమ్మిది మంది పోటీలో ఉన్నారు. కేవలం ఒకే ఒక వార్డులో మాత్రమే ఒక అభ్యర్థి నామినేషన్ దాఖలు అయింది. వీళ్ళ పరిస్థితి ఇలా ఉంటే తెలుగుదేశం పరిస్థితి మరో రకంగా ఉంది. ఎందుకంటే అధికార వైసిపి బెదిరింపుల నేపథ్యంలో ఈ ఎన్నికల్లో చివరి వరకు పోటీలో నిలిచేది ఎవరు అని చర్చించుకునే పరిస్థితి ఏర్పడింది. 

ఎందుకంటే ఇప్పటికే ఓ వార్డులో తెదేపా తరపున అభ్యర్థిగా ప్రకటించబడిన ఒక వ్యక్తి వైసీపీలో చేరడంతో ఆ వార్డులో నామినేషన్ వేయడానికి అవకాశం కూడా లేకపోవడంతో తెలుగుదేశం ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఏకంగా తెలుగుదేశం చైర్మన్ స్థానానికి ఎంపీక చేసిన ఒక నాయకుడు తనకు ఎలాంటి పదవి వద్దని పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని ఇప్పటికే అంతర్గతంగా పార్టీలో ప్రకటించాడు. దీంతో పార్టీ ఛైర్మన్ అభ్యర్థి కోసం వేట మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో కొన్నిచోట్ల గెలుపు రుచి చూసిన బిజెపి కూడా కొన్ని వార్డుల్లో గెలవాలని ప్రయత్నాలు చేస్తోంది. అలాగే పంచాయతీ ఎన్నికలలో చెప్పుకోదగ్గ స్థానాలు సాధించిన జనసేన సైతం గట్టిపోటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: