తెలంగాణలో నిరుద్యోగ భృతి అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఏంటనే దానిపై స్పష్టత రావడం లేదు. అయితే నిరుద్యోగ భృతి విషయంలో యువత చాలా వరకు కూడా ఆశగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే సీఎం కేసీఆర్ ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో వెనకడుగు వేస్తున్నారు అనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో యువతను ఆకట్టుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.

భారతీయ జనతా పార్టీ టార్గెట్ చేసింది. కాబట్టి వారిని దగ్గర చేసుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అనే విషయం స్పష్టంగా చెప్పాలి. అయితే ఇప్పుడు సీఎం కేసీఆర్ కొంతమంది యువ నాయకులకు కొన్ని పదవులు అప్పగించి ఆలోచనలో ఉన్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. కొంతమంది యువ నాయకులు పార్టీకి దూరంగా ఉంటున్నారు. అలాగే కొంతమంది ఉద్యోగాల పేరుతో ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. పార్టీలో మంచి అవకాశాలు వచ్చినా వెళ్లిపోయిన పరిస్థితి ఉంది.

ఈ నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా సీఎం కేసీఆర్ ఆహ్వానిస్తున్నట్టు గా తెలుస్తుంది. అలాగే విదేశాలకు వెళ్ళిన కొంతమంది నేతల మీద కూడా దృష్టి పెట్టారని సమాచారం. తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన తర్వాత సీఎం కేసీఆర్ కొన్ని సంక్షేమ కార్యక్రమాలను యువతకు అనుకూలంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అవి ఏంటి అనే దానిపై స్పష్టత లేకపోయినా దాదాపుగా యువ నేతలతో వంద మంది తో సమావేశమైన తర్వాత ఆయన ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలున్నాయని అంటున్నారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన యువతకు నిరుద్యోగ భృతి అందించే విషయంలో ముందు నిర్ణయం తీసుకున్న తర్వాత మిగిలిన కుటుంబాలకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: