కేసీఆర్ పర్యటనలో షాకిచ్చిన గ్రామస్తులు.. !

 తెలంగాణలో ఎక్కడైనా ఎన్నికలు ఉంటే చాలు అప్పుడు మొదలవుతుంది కేసీఆర్ పర్యటన  ఇన్ని రోజుల నుంచి కనీసం ఎక్కడ కూడా పర్యటన చేయని కేసీఆర్.  ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చాడు. ! హుజురాబాద్ ఎన్నికలు ఆయనను కలవరపెడుతున్నాయని ఈ తతంగం చూస్తే అర్థమవుతుంది.  అందుకే ఆయన పర్యటన పేరుతో అభివృద్ధి పనులను మొదలు పెడుతున్నారు.  అభివృద్ధి పనులతో ప్రజల దృష్టిని మళ్లించి  తన రాజకీయ  అనుభవంతో  హుజురాబాద్ లో  విజయం సాధించాలని  అనుకుంటున్నారని తెలుస్తోంది. ఈ పర్యటన హుజురాబాద్ ఎన్నికలపై ప్రభావం చూపుతుందని తెలుస్తోంది.

 ఈరోజు సిద్దిపేట జిల్లాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని సీఎం కేసీఆర్  ప్రారంభించారు.  అయితే ఈ కార్యాలయాన్ని ఆధునిక సదుపాయాలతో జి ప్లస్ వన్ గా ఎకరం విస్తీర్ణంలో నాలుగు కోట్ల రూపాయలతో నిర్మించారు.  గ్రౌండ్ ఫ్లోర్లో కార్యాలయం, మొదటి అంతస్తులో నివాస సముదాయం ఏర్పాటు చేశారు.  అనంతరం కొండపాక మండలం రాంపల్లి శివారులోని సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ సముదాయాన్ని కేసిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా  ముఖ్యమంత్రి పోలీసులతో గౌరవ వందనం స్వీకరించారు.

 కేసీఆర్ పర్యటిస్తుండగానే  కాన్వాయ్ ని కుక్కునూరు గ్రామానికి చెందిన కొంత మంది ప్రజలు అడ్డుకున్నారు.  మండల కేంద్రానికి కావలసిన అన్ని హంగులు మాకు ఉన్నాయని మండల కేంద్రంగా ఎందుకు ప్రకటించడం లేదని నిరసన వ్యక్తం చేశారు.  ఈ నేపథ్యంలో కుక్కునూరుపల్లి గ్రామం రాజీవ్ రహదారిపై ఫ్లెక్సీలు పట్టుకొని కాన్వాయ్ కి అడ్డం తిరిగి నిలబడ్డారు. ఇప్పుడున్న  మండల కేంద్రమైన  కొండపాక వెళ్లాలంటే దూరమవుతుందని మా గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటిస్తే మా గ్రామం తో పాటు చుట్టుపక్కల గ్రామాలకు లబ్ధి చేసిన వారవుతారని సీఎం కేసీఆర్ కు తెలియజేశారు. ఇప్పటికైనా కెసిఆర్ స్పందించి కుకునూరు గ్రామాన్ని  మండల కేంద్రంగా ప్రకటిస్తే  బాగుంటుందని  పలువురు గ్రామస్తులు కోరుకుంటున్నారు. రాబోవు రోజుల్లో ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: