కర్ణాటకకు కొత్త ముఖ్యమంత్రి ఈరోజు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. కర్ణాటక హోంమంత్రి బసవరాజ్ బొమ్మాయి ఇప్పుడు రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా వ్యవహరించనున్నారు. బిజెపి శాసనసభ పార్టీ సమావేశంలో బి ఎస్ యడ్యూరప్ప బసవరాజ్ బొమ్మాయి పేరిట ప్రతిపాదించారు, దీనికి మొదట గోవింద్ కర్జోల్ మద్దతు ఇచ్చారు, తర్వాత ఎమ్మెల్యేలందరూ మద్దతునిచ్చారు.బసవరాజ్ బొమ్మాయి ఈ ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రి బొమ్మాయితో పాటు కర్ణాటకలో ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోయే ఆర్ అశోక్ వొక్కలిగ వర్గానికి చెందినవారు.



గోవింద్ కర్జోల్. ఎస్సీ వర్గానికి చెందిన వారు. ఇక ఆయన యడ్యూరప్ప ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఇక శ్రీరామలు కూడా ప్రమాణ స్వీకారం చేయనుండగా ఆయన ఎస్టీ వర్గానికి చెందినవారు. ఇలా వేర్వేరు కులాలకు చెందిన వారికి పదవులు కట్టబెట్టడం ద్వారా రాష్ట్రంలో కులాల లెక్కలు మేనేజ్ చేయాలనీ భావిస్తున్నారు. ఈ నిర్ణయం ఎమ్మెల్యేలందరూ ఏకగ్రీవంగా తీసుకున్నారని కర్ణాటక బిజెపి నాయకుడు, కర్ణాటక ఇన్‌ఛార్జి అరుణ్ సింగ్ పేర్కొన్నారు. ఇక బసవరాజ్ బొమ్మాయిహోంమంత్రిగా కూడా మంచి పని చేశారు మరియు మంచి ముఖ్యమంత్రి అని కూడా నిరూపిస్తారని అన్నారు. 



నూతన ముఖ్యమంత్రి బొమ్మాయి రాజకీయంగా ప్రభావవంతమైన లింగాయత్ సమాజానికి చెందిన వారు. ఆయన తండ్రి ఎస్‌ఆర్‌ బొమ్మాయి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశారు. లింగాయత్ బిజెపికి సాంప్రదాయ ఓట్లు అని చెప్పాలి, అలాగే వారు రాష్ట్రంలో 19% మంది ఉన్నారు. యడ్యూరప్ప స్వయంగా లింగాయత్ కావడంతో ఆయనని రీప్లేస్ చేసే వ్యక్తి కూడా అదే వర్గానికి చెందిన వ్యక్తి అయితే బాగుంటుంది అని బీజేపీ ఫిక్స్ అయింది. ఆయన పేరును కూడా యడ్యూరప్ప రిఫర్ చేశారని అంటున్నారు.  యడ్యూరప్పని కించపరిచేలా కాకుండా ఆయన చెప్పినట్టుగానే బీజేపీ ముందుకు వెళ్లిందని అంటున్నారు. బొమ్మాయి ఇంతకు ముందు జెడిఎస్‌లో ఉన్నారు. అక్కడ ఆయన రెండు సార్లు ఎమ్మెల్సీగా పని చేశారు. 2008లో బిజెపిలో చేరిన ఆయన అప్పటి నుంచి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. అతని తండ్రి ఎస్ ఆర్ బొమ్మాయి కూడా మొదటి ముఖ్యమంత్రి మరియు హెచ్ డి దేవెగౌడ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: