జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు ఏ విధంగా వైసీపీ పభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారో తెలిసిందే. ఎలాగైనా జగన్‌కు నెగిటివ్ తీసుకురావాలని, తనకు ప్లస్ చేసుకోవాలని చంద్రబాబు గట్టిగా ప్రయత్నిస్తూ వస్తున్నారు. ప్రతి అంశంలోనూ జగన్ ప్రభుత్వాన్ని తిట్టడంపైనే ఫోకస్ చేస్తున్నారు. ప్రతి టి‌డి‌పి నాయకుడు కూడా జగన్ ప్రభుత్వాన్ని ప్రతి సందర్భంలోనూ తిట్టడమే టార్గెట్‌గా పెట్టుకుని, ప్రజల్లో వైసీపీకి నెగిటివ్ తీసుకురావడానికి నానా కష్టాలు పడుతున్నారు.

ఇక టి‌డి‌పికి తోడుగా, టి‌డి‌పి అనుకూల మీడియా కూడా జగన్‌ని నెగిటివ్ చేసే ప్రయత్నం చేస్తుంది. అయితే ఎంత చేసిన కూడా ప్రజలు ఇంకా జగన్‌కే సపోర్ట్‌గా ఉన్నారని, ఇటీవల వెలువడిన పంచాయితీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. అలాగే తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికలో కూడా వైసీపీకి భారీ మెజారిటీ వచ్చింది. ఈ ఎన్నికలని బట్టి చూస్తే జగన్‌కు జనంలో ఎంత ఆదరణ ఉందో అర్ధమవుతుంది.

అయినా సరే టి‌డి‌పి, టి‌డి‌పి అనుకూల మీడియా సైలెంట్‌గా ఉండదుగా, ఇంకా ఎక్కువగా జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శిస్తూ వస్తుంది. ఈ మధ్య కాలంలో మరింతగా జగన్‌పై విమర్శల దాడి పెంచారు. దీనికి తోడు ఇటీవల వచ్చిన కొన్ని సర్వేలు కూడా జగన్‌కు వ్యతిరేకంగా వచ్చాయి. దీంతో జనంలో జగన్‌కు ఆదరణ తగ్గిపోయిందని ప్రచారం మొదలైంది. అయితే దీన్నే ప్రజలు నమ్మే పరిస్తితి వచ్చేసింది. ఈ క్రమంలోనే ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల ఫలితాలు వెలువడటం జగన్‌కు బాగా ప్లస్ అవ్వనున్నాయని చెప్పొచ్చు.


తాజాగా హైకోర్టు....ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల ఫలితాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అయితే ఈ ఫలితాలు కూడా పూర్తిగా వైసీపీకే అనుకూలంగా రానున్నాయని తెలుస్తోంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో పోటీకి టి‌డి‌పి చేతులెత్తేసింది. దీంతో స్థానిక పోరు వార్ వన్ సైడ్ అన్నట్లుగా జరిగింది. ఇక ఈ ఫలితాలు వచ్చాక జగన్ సత్తా ఏ మాత్రం తగ్గలేదని అర్ధమవుతుంది. కరెక్ట్ టైమ్‌లో ఈ ఫలితాలు జగన్‌కు ప్లస్ చేయనున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: