కరోనా కారణంగా ఉపఎన్నిక చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పుడు కాస్త నెమ్మదించడంతో ఎన్నికల సంఘం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల తో చర్చించి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ ఎన్నిక జరగాల్సి ఉండగా, తమకు పండుగ తరువాతే కావాలి  అనడంతో అక్కడ వాయిదా పడింది. మిగిలిన రాష్ట్రాలలో ఉపఎన్నిక ఘంటికలు మోగాయి. దీనితో అక్కడ పూర్తిగా వాక్సినేషన్ అందరికి ఎన్నికల సమయంలోగానే వేయాలని ప్రభుత్వాలు యోచిస్తున్నాయి. ఇప్పటికే దేశంలో రోజు 2 కోట్లపైగానే  వాక్సినేషన్ కార్యక్రమం చేయిస్తున్నారు.

ఉపఎన్నిక ప్రారంభం అయ్యే లోగానే ఆయా రాష్ట్రాలలో వాక్సినేషన్ వంద శాతం పూర్తిచేసి రిస్క్ తగ్గించుకోవాలని ప్రభుత్వాలు నిర్ణయించుకున్నాయి. దీనికోసం అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు సన్నద్ధం అవుతున్నాయి. వంద శాతం వాక్సినేషన్ ద్వారా ఓటింగ్ సమయంలో కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా పాల్గొనే అవకాశం ఉండనుందని, తద్వారా ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 45+ వాళ్లకు వాక్సినేషన్ పూర్తిగా అయిపోయింది. ఇక మిగిలిన వారికి శరవేగంగా వాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. తాజగా పిల్లలలకు కూడా వచ్చే ఏడాది కల్లా వాక్సినేషన్ వస్తుందని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది.

వాక్సినేషన్ విషయంలో దేశం రోజు ఒక కొత్త లక్ష్యాన్ని ఛేదిస్తూ వస్తుంది. రోజు ఒక కొత్త రికార్డు నెలకొల్పుతుంది. ఇది ఇలాగె కొనసాగితే అక్టోబర్ మొదటి వారానికే దేశంలో 100 కోట్ల మందికి వాక్సినేషన్ పూర్తికానుంది. ఇదే తరహాలో త్వరలో ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా లలో కూడా వంద శాతం వాక్సినేషన్ ఓటింగ్ కు ముందే పూర్తి చేయాలని అధికారులు అనుకుంటున్నారు. అలాగే 60 శాతం కేసులు నమోదు అవుతున్న కేరళ లో కూడా వాక్సినేషన్ వేగవంతం చేసేశారు. ఇక కర్ణాటక లో కూడా వాక్సినేషన్ వేగవంతం అయ్యింది.  కేంద్రం కూడా దేశంలో వివిధ పరిస్థితులను అనుసరించి, దానికి తగ్గట్టుగా వాక్సినేషన్ ప్రాముఖ్యతను పెంచుకుంటూ పోతుంది. ఇతర రాష్ట్రాలలో కూడా వాక్సినేషన్ డ్రైవ్ జరుగుతూనే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: