ఎవరైనా మనసు బాగాలేకపోతే గుడికి వెళ్లి కాసేపు కూర్చొని రావడమో లేదా తీర్థయాత్రలు చేయడం వలననో కాస్త ఉపశమనం పొందుతారు. అయితే ఇవాళారేపు ఈ ప్రాంతాలలో కూడా రాజకీయాలు, పెత్తనాల కోసం కుమ్ములాటలు చోటు చేసుకోవడంతో అసలు ఆధ్యాత్మికత మీద రానురాను సామాన్యులకు నమ్మకం సన్నగిల్లుతుంది. భారత్ లాంటి ఆధ్యాత్మిక ప్రదేశాలలో ఇలాంటివి చోటుచేసుకోవడం అందరి మనసును కలిచివేస్తుంది. ఇలాంటి ప్రదేశాలలో కూడా ఆస్తులపై పెత్తనం కోసం ఆయా వర్గాలు గొడవలకు దిగుతూ కోర్టుల వరకు వెళ్తుండటం వాళ్లకు ఎలా ఉందొ కానీ చూసేవాళ్లకు మాత్రం చాలా హేయంగా ఉంది.

ప్రస్తుతం ఈ ప్రాంతాల చుట్టూ కూడా రాజకీయాలు జరుగుతుండటంతోనే ఇదంతా వస్తున్నదని కొందరు అభిప్రాయపడుతున్నారు. అందులోను నిజం లేకపోలేదు, ఎందుకంటే ప్రస్తుత రాజకీయాలలో కులం మతం ప్రస్తావన లేకుండా ఎక్కడా కూడా ఏ నేత కూడా ప్రచారం చేయడం లేదు. ఇందులో ఒక్కో పార్టీకి ఒక్కో చరిత్ర ఉందంటేనే ఆధ్యాత్మిక ప్రదేశాలలో రాజకీయాలు ఏ స్థాయికి ప్రవేశించాయో తెలిసిపోతుంది. ఇక్కడ భక్తుల తాకిడి ఎక్కవుగా ఉండటంతో ఆదాయం కాస్త మెరుగ్గా ఉండటంతో దానిపై నేతల కన్ను పడుతుంది. ఇంకేముంది వెంటనే అక్కడ జొరబడటం ఎలా అనే ఆలోచన నుండే ఈ ప్రాంతాల లో ఉన్న ప్రశాంతత కలుషితం అవుతుంది.

ఇటీవల బాగా ప్రాచుర్యం పొందిన బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్యం కూడా ఇలాంటిదే. ఆధిపత్యం కోసం అక్కడి వారే రచ్చకెక్కడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అసలు ప్రశాంతత కోసం అందరూ ఇలాంటి ప్రదేశాలకు వస్తూ ఉంటె ఇక్కడ మాత్రం అవేమి కనిపించడం లేదు.. అనే అభిప్రాయం భక్తులలో వచ్చేస్తుంది. ఒకపక్క నిండైన నమ్మకంతో అక్కడి వరకు రావడానికి నానా తిప్పలు పడుతున్న వారు తీరా అక్కడకు  చేరుకున్నాక ఇలాంటి గొడవలు చూసి ఎలా భావిస్తారో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు సహా ఇక్కడకు జనాల తాకిడి పెరిగి ఆదాయం వస్తే ఇంకా చక్కగా ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవచ్చు అనే లక్ష్యంతో ఎన్నో ప్రచారాలు చేసి భక్తులను ఆయా ప్రాంతాలకు రప్పిస్తుంటే, ఇలాంటి ఘటనలు ఆధ్యాత్మిక ప్రదేశాలపై ఆసక్తిని చెరిపేస్తున్నాయి. తాజాగా బ్రహ్మంగారి మఠం పిఠాదిపతిని రెండు నెలలలో నియమించే ఏర్పాట్లు చేయాలని హైకోర్టు ఆయా అధికారులను ఆదేశించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: