సాధారణంగా ప్రియమైన వారు చనిపోతే ఎవరైనా సరే శోకసంద్రంలో మునిగిపోతారు.  అయితే ఇక అంత్యక్రియలు పూర్తయిన తర్వాత వారి చితాభస్మాన్ని పవిత్ర గంగాజలంలో కలిపి వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఉంటారు అనే విషయం తెలిసిందే. ఇది సాధారణంగా అందరూ చేసేదే. కానీ ఇక్కడ ఒక మహిళ మాత్రం చిత్ర విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. ఆమె భర్త చనిపోయాడు. దీంతో ఎంతో మనస్థాపం చెందింది ఆ మహిళ. అయితే ఆమె భర్త యొక్క చితాభస్మాన్ని సేకరించింది. అయితే దీనిని ఎక్కడో పవిత్ర ప్రాంతం లో కలిపి వేయకుండా ఏకంగా తినడం మొదలుపెట్టింది.


 ఏంటి అవాక్కయ్యారు కదా.. కానీ ఇది నిజమే.. ఏకంగా చితాభస్మాన్ని తినడం అలవాటుగా మార్చుకుంది. ఇక్కడ ఒక మహిళ బ్రిటన్లో ఈ ఘటన చోటుచేసుకుంది.  రోజు ఇలా భర్త చితాభస్మాన్ని కొంత మొత్తంలో తినడంఫై ఎంతగానో ఆసక్తి కనబరుస్తుంది సదరు మహిళ. బ్రిటన్కు చెందిన కాసి అనే మహిళ 2009 సంవత్సరంలో సీన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అతను ఆస్తమాతో బాధపడుతు ఉండేవాడు. ఈ క్రమంలోనే ఇదే ఆరోగ్య సమస్యతో ఓ రోజు మరణించాడు. ఇక భర్త మరణంతో ఎంతో బాధపడింది సదరు మహిళ. చితాభస్మాన్ని భారీ మొత్తంలో తీసుకొని తన దగ్గర పెట్టుకుంది.


 ఇక అప్పటి నుంచి ఎక్కడికి వెళ్లినా కూడా భర్త చితాభస్మాన్ని తన వెంట తీసుకెళ్లడం అలవాటు చేసుకుంది. అంతేకాదు రోజు కొంత మొత్తంలో తన భర్త చితాభస్మాన్ని తింటున్నాను అంటూ చెబుతుంది. ఇక ఇప్పుడు అదే అలవాటుగా మారిపోయిందని ఆ చితాభస్మం పూర్తిగా కుళ్ళిన వాసన వస్తున్నప్పటికీ తనకు మాత్రం అది తినడం ఎంతో ఇష్టం గానే ఉందని అందుకే కొంచెం కొంచెం గా తింటున్నాను అంటూ తెలిపింది. తన భర్త తనతో పాటు ఉన్నట్లు గా భావిస్తున్నాను అందుకే ఇలా చేస్తున్నాను అంటూ చెబుతుంది సదరు మహిళ. కాగా ఆ మహిళ చేసిన పని కాస్తా స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: