గత కొద్ది రోజుల నుంచి ఏపీ పై వర్షాలు పగబట్టినట్టు అక్కడి ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే వరదల ధాటికి కొన్ని జిల్లాలలో తీవ్రమైన నష్టం వాటిల్లింది. మరోవైపు తుఫాన్లు దూసుకు వస్తూ  ఏపీ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. అయితే ఓవైపు ప్రజలు వరదలతో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఏపీ రాజకీయ పార్టీలు మాత్రం ఈ వరదలపై రాజకీయాన్ని చేస్తూ, ప్రజలను ఇంకా ఇబ్బందులకి గురి చేస్తున్నారు.. మరి ఏపీలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం..?

 ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీల దృష్టి ఈ వరదల పైనే పడింది. అన్నమయ్య ప్రాజెక్టు మట్టిగడ్డ తెగిపోవడంతో ఈ రాజకీయ నాయకులు అరంగేట్రం ప్రారంభమైంది. ఈ విషయంపై ప్రతిపక్షాలు గట్టిగానే విమర్శిస్తూ ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ మాత్రమే కాకుండా పార్లమెంట్లో జలశక్తి మంత్రి గజేంద్ర షేకవత్ కూడా  ఏపీ ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవడంలో విఫలమైందని అనడంతో ఏపీ రాజకీయాల్లో మంటలు చెలరేగాయి. దీనిపై వైసీపీ మంత్రి అనిల్ కూడా స్పందించి విమర్శలకు ప్రతి విమర్శలు చేశారు. బిజెపి పార్టీ కావాలనే తమ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వస్తోందని మండిపడ్డారు. పెన్నా బేసిన్కు చరిత్రలో ఎప్పుడూ రానంత వరద వస్తే ఎవరైనా ఏం చేస్తారు అని, ప్రకృతి ప్రలయాన్ని  ఆపే శక్తి ఎవరికి ఉంటుందని ప్రశ్నించారు. ఎన్ని గేట్లు ఎత్తి వేసిన మట్టికట్ట కొంతమేరకు దెబ్బతిందని, దీనిపై కూడా రాజకీయం చేస్తార అని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ పాపం గత ప్రభుత్వాలదే అని, ప్రకృతి పరంగా వరదలు వస్తే, చంద్రబాబు వరదలపై శవ రాజకీయాలు చేస్తున్నారని, ఆయనకు ప్రతిపక్ష నేతగా కూడా కొనసాగే అర్హత లేదని ఘాటుగా విమర్శించారు.

టిడిపి బిజెపి కలిసి ఇలా విమర్శలు చేయడం పనికిమాలిన చర్య అని అన్నారు. దీనిపై స్పందించిన చంద్రబాబు గజేంద్ర శఖవత్ అడిగినటువంటి ప్రశ్నలకు వైసిపి సమాధానం చెప్పాలని అన్నారు. ఏది ఏమైనా వరదల ధాటికి ఎంతో మంది ప్రాణాలు పోయాయి. చాలా మంది నిరాశ్రయులయ్యారు. వీరిని ఏ విధంగా ఆదుకోవాలో ఆలోచించకుండా అటు వైసీపీ ప్రభుత్వం, టిడిపి, బిజెపిలు రాజకీయ విమర్శలకు మాత్రమే పరిమితమై వరద బాధితులను ఆదుకోవడంలో విఫలమవుతున్నారని, ఓ వైపు ప్రజలు వరదల ధాటికి ఇండ్లు, పంట మొత్తం నష్టపోతే  వీరు మాత్రం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రాజకీయ పబ్బం గడుపుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: