దేశ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రెండు రోజులు గా హైదరాబాద్ లో దంచి కొడుతున్న వానలు.. ఇక రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నాయని తెలిపారు. ఉత్తర భారతం నుంచి తిరోగమనంలో పయనిస్తున్న నైరుతి రుతుపవనాలు తెలంగాణ పై నుంచి చురుగ్గా కదులుతున్నాయి. దీనితో పాటు బంగాళాఖాతం లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున స్థిరంగా ఉంది. దీని ప్రభావం తో ఈ నెల 30 వరకు రాష్ట్రం లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు వివరించారు.


ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని పేర్కొన్నారు. పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, కొమురంభీమ్‌ ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపుల తో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు..


భాగ్యనగరంపై కుండపోత వాన కురిసింది. నగరవాసు లపై తన ప్రతాపం చూపించాడు. వరుసగా రెండో రోజూ హైదరాబాద్ పై వరుణుడు విరుచుకుపడ్డాడు. నాంపల్లి, బషీర్ బాగ్, లక్డీకాపూల్‌, కోఠి, బేగంబజార్, సుల్తాన్ బజార్, ప్యాట్నీ, అబిడ్స్, నారాయణగూడ, హైదర్‌గూడ, నాంపల్లి, సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లి, హిమాయత్‌నగర్‌, మెహదీపట్నం, మాసబ్‌ట్యాంక్‌, మారేడ్‌పల్లి, తిరుమలగిరి, చిలకలగూడ, బేగంపేట్‌, అల్వాల్‌, ప్యారడైజ్‌ తదితర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం పడింది. ఒక్కసారిగా కురిసిన వర్షాల కు రోడ్లపై నీరు నిలిచిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.. మరో రెండ్రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: