ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల జోరు భారీ ఎత్తున జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. పార్టీలు అందులోని వ్యక్తులు తమ పార్టీలు అధికారంలోకి వస్తే ఏం చేస్తాయి..? ప్రజలకు ఎలాంటి సౌకర్యాలను కల్పిస్తాయి అనే విషయాలను తెలియజేస్తూ వస్తుంటే ప్రజలు ఆ ప్రాంతంలో పోటీ చేసే వ్యక్తులలో ఎవరు అయితే తమకు మంచి చేస్తారు అనే దానిపై దృష్టి పెట్టారు. ఇక ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఉన్న ఎంపీ స్థానాలలో కొన్నింటిపై స్టేట్ మొత్తం ఆసక్తిని కనబరుస్తూ ఉంటుంది. అలాంటి వాటిలో విజయవాడ ఎంపీ స్థానం ఒకటి. ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకు మంచి క్రేజ్ ఉంటుంది.

దానితో గడిచిన కొన్ని దశాబ్దాలుగా ఏ పార్టీ అయినా ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకే సీట్ ను కేటాయిస్తూ వస్తున్నారు. ఈ సారి కూడా ఈ ప్రాంతంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన సభ్యుల మధ్య పోరు ఉండబోతుంది. ఈసారి ఈ స్థానంలో కేశినేని బ్రదర్స్ మధ్య భారీ పోరు నెలకొనే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. గతంలో టిడిపి పార్టీ నుండి విజయవాడ ఎంపీ స్థానాన్ని వరుసగా రెండు సార్లు గెలిచిన కేశినేని నాని ఆ తర్వాత వైసిపి పార్టీలోకి జంప్ అయ్యారు. ఈ సారి నాని వైసీపీ పార్టీ నుంచి విజయవాడ ఎంపీ స్థానానికి బరిలోకి దిగబోతున్నాడు. అలాగే టీడీపీ అభ్యర్ధికి సవాల్ విసురుతున్నారు. ఇకపోతే ఈ స్థానంలో గెలవాలి అంటే అనేక ఈక్వేషన్స్ ఉన్నాయి. కేవలం కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మాత్రమే కావడం కాకుండా ఈ ప్రాంత ప్రజలు ఎక్కువగా టిడిపి పార్టీని ఇష్టపడుతుంటారు. దానితో గడిచిన రెండు పార్లమెంట్ ఎన్నికలలో ఇక్కడి నుండి టీడీపీ అభ్యర్ధిగా కేశినేని నాని ఎంపీగా గెలిచారు.

ఇన్నాళ్లపాటు టీడీపీలో కొనసాగిన ఈయన వైసీపీలోకి జంప్ అయ్యారు. అలాగే ఆ పార్టీ నుండి విజయవాడ ఎంపీ స్థానంలో పోటీ కూడా చేయబోతున్నాడు. నాని టిడిపి పార్టీని వదిలి వెళ్లడంతో ఈ ప్రాంత ఎంపీ సీటు విషయంలో టిడిపి పార్టీ చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అని చాలామంది అనుకున్నారు. కానీ ఆ సమయంలోనే కేశినేని నాని సోదరుడు అయినటువంటి కేశినేని చిన్ని టిడిపి పార్టీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈయన ఇదే స్థానం నుండి టిడిపి పార్టీ నుండి ఎంపీగా పోటీ చేయబోతున్నాడు. ఇక వీరిద్దరికీ ఈ ప్రాంతంలో మంచి పట్టు ఉండడం ... అలాగే వీరిద్దరూ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కావడంతో ఈ ప్రాంత ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారు అనే విషయం ఉత్కంఠ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: