పోలీసులు లేకుండా ఒక్క గంట కూడా బయట తిరగలేరు. తమ డాబు, దర్పం చూపించటానికి పోలీసు భద్రత చాలా అవసరం.  అవసరం లేదని భావించి ప్రభుత్వం భద్రతను కుదిస్తే కోర్టులకు వెళ్ళి మరీ పోరాటాలు చేస్తారు. అలాంటి నేతలు పోలీసు అధికారులను నోటికొచ్చినట్లు తిట్టారు. అదికూడా విధి నిర్వహణలో ఉన్న ఓ ఎస్పీని తన సిబ్బంది ముందు రోడ్డుపై జనాలందరూ చూస్తుండగానే.

 

అదే సమయంలో మహిళా కమీషన్ కు ఛైర్ పర్సన్ గా పనిచేసిన ఓ సీనియర్ నేత ఓ మహిళా ఎస్సైని అందరి ముందు ’ఈ దిళితులతోనే దరిద్రమంతా వచ్చింది’ అంటూ నోరు పారేసుకున్నారు. మరో మాజీ మంత్రి అయితే హౌస్ అరెస్టులో భాగంగా హోటల్ లో బందోబస్తులో ఉన్న ఓ మహిళా ఎస్సైని నోటికొచ్చినట్లు మాట్లాడింది.

 

నిజానికి అధికారంలో ఎవరున్నా చెప్పినట్లు చేయటమే పోలీసుల పనియిపోయింది. విచక్షణతో పనిచేయటం అన్నది ప్రభుత్వ అధికారుల్లో ఏనాడు పోయింది. చంద్రబాబునాయుడు చలో ఆత్మకూరు పిలుపులో భాగంగా టిడిపి నేతలు రోడ్లపైకి వచ్చారు. అటువంటి వారిలో మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, భూమా అఖిలప్రియ కూడా ఉన్నారు. వారితో పాటు మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ గా పనిచేసిన నన్నపనేని రాజకుమారి కూడా ఒకరు.

 

అచ్చెన్న అయితే ఎస్పి విక్రాంత్ పాటిల్ ను నోటికొచ్చినట్లు తిట్టారు. అందరి ముందు చివరకు ’యూజ్ లెస్ ఫెలో’ అని కూడా అనేశారు. భూమా కూడా నోటికొచ్చినట్లు మహిళా ఎస్సైని తిట్టారు. మళ్ళీ ఇదే పోలీసుల భద్రత లేకుండా ఒక్క గంట కూడా వీళ్ళెవరూ బయటకు అడుగు కూడా పెట్టలేరు. అధికారంలో ఉన్న పార్టీ చెప్పినట్లు చేయటం తప్ప వీళ్ళేమీ చేయలేరనే కనీసం ఇంగితం కూడా అచ్చెన్న, భూమా, నన్నపనేనిలో లోపించింది. అధికారంలో ఉన్నపుడు వైసిపి విషయంలో తామేం చేశారో ఇపుడు తమకదే జరుగుతోందనే ఇంగితం ఉన్న వాళ్ళైతే పోలీసులపై నోరు పారేసుకోరు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: