నెల్లూరు నారాయణ టీడీపీలో ఒకప్పుడు చక్రం తిప్పారు. కానీ ఇప్పుడు టీడీపీ అధికారం కోల్పోవటంతో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. నెల్లూరు నారాయణ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు తరువాత ఆ స్థాయిలో అధికారాన్ని చలాయించారు. కానీ అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు కదా ! ఇప్పుడు టీడీపీ ఓటమి నారాయణను బాగా కుంగదీసినట్టుంది. కనీసం మీడియా ముందుకు కూడా రావటం లేదు. నెల్లూరు స్థానం నుంచి పోటీ చేసి కూడా నారాయణ ఓడిపోవటంతో పరువు కూడా పోయింది. నెల్లూరులో  నారాయణ అభివృద్ధి కొద్దో గొప్ప చేసినా  .. డబ్బులు విచ్చలవిడిగా వెదజల్లినా గెల్వలేకపోయారు. మీడియా ముందుకు కూడా నారాయణ రాలేకపోతున్నారు. రాజధాని వ్యవహారంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఇప్పటికే నానా హంగామా చేస్తుంది.


కానీ టీడీపీ పార్టీలో రాజధాని కమిటీ అధ్యక్షుడిగా పని చేసిన నారాయణ మాత్రం నోరు మెదపటం లేదు. రాజధాని విషయంలో బాబుతో పాటు నారాయణ కూడా దేశ విదేశాలు తిరిగారు. కీలక నేతగా వ్యవహరించారు. కానీ ఇప్పుడు రాజధాని వ్యవహారంలో ఒక పక్క టీడీపీ నేతలు .. లోకేష్ కూడా నిరసనకు దిగుతుంటే నారాయణ మాత్రం మౌన వ్రతం పాటిస్తున్నారు. అయితే నారాయణ మీద కేసులు నమోదు కాబోతున్నాయని సమాచారం వచ్చింది. నారాయణ కూడా వైసీపీలో చేరడానికి ట్రై చేశారు. కానీ వైసీపీ నుంచి స్పందన రాకపోయేసరికి సైలెంట్ అయిపోయారు. ఎక్కడ నోరు తెరిసి విమర్శలు చేస్తే ...  వైసీపీ తన ఆస్తుల మీద పగ పడుతుందోనని ఆందోళనలో నారాయణ ఉన్నారు.


అయితే నారాయణ రాజకీయాల్లో నుంచి తప్పుకుంటాడని ఒక టాక్ అయితే బయటికి వస్తుంది. ఇప్పటికే నారాయణ కూతురు జగన్ దంపతలను కలిసి వారితో ముచ్చటించింది. ఇక నుంచి తాము రాజకీయాల్లో యాక్టీవ్ గా ఉండదలుచుకోలేదని చెప్పినట్టు సమాచారం. ఈ వ్యాఖ్యలు వెనుక అర్ధం వేరే ఉంది. వైసీపీ ప్రభుత్వం ఎక్కడ నారాయణ ఆస్థుల మీద కేసుల పెట్టిస్తుందని ముందు జాగ్రత్తగా కలిసినట్టు కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. అయితే ఇవన్నీ గమనిస్తే నారాయణ రాజకీయం కంచికి చేరినట్టేనని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: