సూర్య కుమార్ యాదవ్.. కేవలం భారత క్రికెట్లో మాత్రమే కాదు అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచం లో ఇతని పేరు గత కొన్ని రోజుల నుంచి మారు మోగిపోతూనే ఉంది అని చెప్పాలి. యువ ఆటగాళ్లు అందరితో పోల్చి చూస్తే జట్టు లోకి కాస్త ఆలస్యం గా అరంగేట్రం చేసినప్పటికీ కూడా సూర్య కుమార్ యాదవ్ తక్కువ సమయం లోనే తన బ్యాటింగ్ ప్రతిభతో ఊహించని రీతిలో పాపులారిటీ సంపాదించుకున్నాడు అని చెప్పాలి. ఈ క్రమం లోనే మెరుపు ఇన్నింగ్స్ ఆడుతూ ప్రతి మ్యాచ్లో కూడా టీమిండియా విజయం లో కీలకపాత్ర వహిస్తున్నాడు.


అంతేకాదు మైదానం నలువైపులా కూడా భారీ షాట్లు ఆడుతూ మిస్టర్ 360 ప్లేయర్గా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక అతని వీర బాదుడు చూసి స్టార్ బౌలర్లు సైతం సూర్య కుమార్ యాదవ్ కు బౌలింగ్ వేయాలి అంటేనే భయపడిపోతున్న పరిస్థితి నెలకొంది ప్రస్తుతం.  ఇక అతను బ్యాటింగ్ చేస్తున్న విధానం క్రికెట్ అభిమానులనే కాదు మాజీ క్రికెటర్లను సైతంమైమరచి పోయేలా  చేస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దీంతో అతని అద్భుతమైన బ్యాటింగ్ పై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.


 ఇకపోతే ఇటీవల సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ తీరుపై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ స్పందిస్తూ ప్రశంసలు కురిపించాడు. టాప్ క్లాస్ ఫేసర్లు,  స్పిన్నర్లు,టర్నింగ్, సీమింగ్  పిచ్ లు చాలా కఠినమైన పరిస్థితులు.. ఇవేవీ కూడా సూర్య కుమార్ యాదవ్ ను భయపెట్టలేవు. అతను ఆరెంజ్ క్యాప్ గెలుచుకోకపోవచ్చు.. మ్యాన్ అఫ్ ది మ్యాచ్ రాకపోవచ్చు.. కానీ సూర్య కుమార్ యాదవ్ మాత్రం తప్పకుండా మ్యాచ్ గెలిపిస్తాడు. టీమిండియాలో నెంబర్ ఫోర్ స్థానంపై సూర్యకుమార్ యాదవ్ కర్చీఫ్ వేసి కూర్చున్నాడు. చాలాకాలం ఆ స్థానంలో ఇక అతడే కొనసాగుతాడు అంటూ మహమ్మద్ కైఫ్ చెప్పకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: