ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే భారత క్రికెట్ ప్రేక్షకులందరూ ఎంతలా ఉర్రూతలూగి పోతారో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బిసిసిఐ 2008లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇండియన్ ప్రీమియర్ లీక్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటికి కూడా ప్రతి సీజన్ అంతకంతకు క్రేజ్ సంపాదించుకుంటూ దూసుకుపోతుంది. అయితే గత ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తారా లేదా అని అందరూ అనుమాన పడినప్పటికీ ఇక క్లిష్ట పరిస్థితుల మధ్య భారత్లో కాకుండా యూఏఈ వేదికగా ఐపీఎల్ టోర్నీ నిర్వహించింది బీసీసీఐ. అయితే ఐపీఎల్ టోర్నీ చూసాము అన్న సంతోషం క్రికెట్ ప్రేక్షకులకు మిగిలినప్పటికీ అసలు సిసలైన మజా మాత్రం మిస్ అయ్యాము అని ఫీల్ అయ్యారు క్రికెట్ ప్రేక్షకులు.



 ఈ క్రమంలోనే ఇక ఈ ఏడాది ఐపీఎల్  నిర్వహించేందుకు బిసిసీఐ  ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టింది అనే విషయం తెలిసిందే. అనుకున్న సమయానికి.. ఐపీఎల్ టోర్నీ నిర్వహించాలి అని బిసిసిఐ భావించింది.  అయితే గత ఏడాదిలాగా  విదేశాల్లో కాకుండా ఈసారి భారత్ వేదికగానే ఐపీఎల్ తోని నిర్వహించాలని బిసిసిఐ భావించడంతో ప్రస్తుతం ప్రేక్షకులు అందరిలో కొత్త ఉత్సాహం నిండిపోయింది అనే చెప్పాలి. ఈ క్రమంలోనే ఐపీఎల్ టోర్నీ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు క్రికెట్ ప్రేక్షకులు.



 అయితే ఐపీఎల్ 2021 భారత్ లో నిర్వహించాలని..  ఇక ప్రేక్షకులను కూడా స్టేడియంలో అనుమతించాలని ముందుగా బిసిసిఐ నిర్ణయించింది. ముంబై పూణే వేదికలో ఐపీఎల్ నిర్వహించాలి అని భావించింది.  కానీ ప్రస్తుతం మహారాష్ట్రలో  వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో బిసిసిఐ మరోసారి అయోమయంలో పడిపోయింది. ఈ క్రమంలోనే ఐపీఎల్ టోర్నీ భారత్లో నిర్వహించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి అంటూ ఇటీవలే బీసీసీఐ అధికారి ఒకరు చెప్పడం ఐపీఎల్ అభిమానులందరినీ కూడా అయోమయంలో పడేసింది. ఇక ప్రస్తుతం భారత్ ఇంగ్లండ్ జట్ల మధ్య సొంతగడ్డపై సిరీస్ లు  జరుగుతూ ఉండగా ఈ సిరీస్ ముగియగానే ఐపీఎల్ పై  క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: