2008 లో ప్రారంభ‌మైన ఐపీఎల్ ప్ర‌తి యేటా కొత్త పుంత‌లు తొక్కుతూ కోట్లాది మంది అభిమానుల‌ను సొంతం చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌తి ఐపీఎల్లో 8 జ‌ట్లు పాల్గొంటున్నాయి. మ‌ధ్య‌లో ఓ సారి ఐపీఎల్లో 10 జ‌ట్లు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత నుంచి మ‌ళ్లీ 8 జ‌ట్ల‌తోనే ఐపీఎల్ టోర్న‌మెంట్ నిర్వ‌హిస్తున్నారు. ఇక వ‌చ్చే ఐపీఎల్ టోర్న‌మెంట్ ను మ‌రో రెండు జ‌ట్లు పెంచి మొత్తం 10 జ‌ట్ల‌తో నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ రెండు కొత్త జ‌ట్ల కు సంబంధించి బీసీసీఐ వేలం పాట‌కు బిడ్డింగ్ లు ఖ‌రారు చేయ‌నుంది.  ఈ సారి కొత్త ఐపీఎల్ జ‌ట్ల ధ‌ర‌లు రికార్డు స్థాయిలో ప‌లికే అవ‌కాశాలు ఉన్నాయి.

వ‌చ్చే 10 ఏళ్ల పాటు ఈ రెండు జ‌ట్ల ఓన‌ర్ షిఫ్‌ను ద‌క్కించుకునే క్ర‌మంలో వీటి విలువ కోట్ల‌లో ఉంటుద‌ని అంచ‌నా వేస్తున్నారు. ప‌దేళ్ల‌కు వీటి విలువ రు. 8 వేల కోట్లు ఉంటుంద‌ని చెపుతున్నారు. ఈ రెండు ఐపీఎల్ జ‌ట్ల ఓన‌ర్ షిఫ్ ద‌క్కించుకునేందుకు అనేక మంది బ‌డా బ‌డా పారిశ్రామిక వేత్త‌లు , సెల‌బ్రిటీలు పోటీ లో ఉన్నారు. దీంతో ఈ జ‌ట్ల కోసం పోటీ తీవ్రంగా ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే ఓ టీంను ద‌క్కించు కునేందుకు బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్ వీర్ సింగ్, అత‌డి భార్య హీరోయిన్ దీపికా ప‌దుకోన్ ఓ బిడ్ దాఖ‌లు చేసిన‌ట్టు తెలుస్తోంది. అయితే వీరు సింగిల్ గానే బిడ్ వేశారా ?  లేదా మ‌రెవ‌రితో అయినా క‌లిసి బిడ్ దాఖ‌లు చేశారా ? అన్న‌ది మాత్రం తెలియ‌లేదు. ఇప్ప‌టికే బాలీవుడ్ కు చెందిన షారుక్ కు కోల్‌క‌త్తా, పంజాబ్  లో ప్రితిజింతాకు వాటాలు ఉన్నాయి. ఇక గ‌తంలో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌కు వాటాదారులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

IPL