ప్రస్తుతం రకరకాల ఫీచర్లతో రకరకాల స్మార్ట్ ఫోన్స్ అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ మధ్య కాలంలో చాలా వరకు 5 సపోర్ట్ ఫోన్స్ అంటూ మార్కెట్‌లో స్మార్ట్ ఫోన్లను విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు.భారతదేశంలో మొదటి 5g నెటవర్క్‌ను ఇంకా ఏ కంపెనీ ప్రారంభించలేదు. దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీపావళికి ముందే 5జి సేవలను ప్రారంభిస్తామని రిలయన్స్ జియో కంపెనీ ఇప్పటికే తన AGM లో తెలిపింది. అదే సమయంలో ఎయిర్‌టెల్ కూడా ఈ సంవత్సంర 5g సేవలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఇక తాజాగా వొడాఫోన్ ఐడియా కూడా 5జీ సేవలపై కీలక ప్రకటన చేసింది. త్వరలోనే 5జీ సేవలను ప్రారంభిస్తామని ప్రకటించారు ఆదిత్యా బిర్లా గ్రూప్ చైర్మన్.5జీ నెట్‌వర్క్ అందుబాటులోకి రాకముందే.. 5జి సపోర్ట్ పేరుతో మొబైల్స్ మార్కెట్‌లో రావడం విశేషం. మార్కెట్‌లో రూ. 13 వేల నుంచి 1.50 లక్షల వరకు ఈ ఫోన్ల ధర ఉంది. మరి మీ మొబైల్ నిజంగానే 5జి సపోర్ట్ చేస్తుందా? లేదా? అనేది తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం.


ఇందుకోసం వినియోగదారులు ముందుగా, మొబైల్ సెట్టింగ్‌లకు వెళ్లాలి. ఆ తర్వాత నెట్‌వర్క్ & ఇంటర్నెట్‌ ఆప్షన్ చెక్ చేయాలి. అక్కడ మొబైల్ నెట్‌వర్క్ కింద ఇచ్చిన ప్రియారిటీ నెట్‌వర్క్ టైప్‌పై క్లిక్ చేయాలి. ఓపెన్ అవగానే మొత్తం ఆప్షన్స్ కనిపిస్తుంది. అయితే, వేర్వేరు స్మార్ట్‌ఫోన్‌లు, వేర్వేరు ఆప్షన్స్ కలిగి ఉంటాయి. ఈ ఆప్షన్స్‌లో 5జి ఉంటే.. మీ మొబైల్ ఫోన్ కూడా 5జి కి సపోర్ట్ ఇస్తుందని భావించొచ్చు. అయితే, బ్యాండ్‌ల వ్యాత్యాసం కూడా ఉంటుంది. వీటి లిస్ట్ ని త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది.నిపుణుల ప్రకారం.. 5g వేగం 4G కంటే 100 రెట్లు అధికంగా ఉంటుంది. రెప్పపాటు వేగంతో పని చేసుకోవచ్చునని చెబుతున్నారు. మరి దీని స్పీడ్ ను అనుభూతి చెందాలంటే కొద్దికాలం మాత్రం వెయిట్ చేయక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: