మీరు కొత్త బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అది కూడా కొత్త ఎలక్ట్రిక్ బైక్ కొనాలని మీరు ఆలోచిస్తున్నారా? అయితే ఒక అదిరిపోయే సూపర్ మోడల్ మీకు అందుబాటులో ఉంది. ఇది చూడటానికి మంచి సూపర్ లుక్‌తో ఉంటుంది.ఈ ఎలక్ట్రిక్ బైక్ ఖచ్చితంగా అందరినీ ఎంతగానో ఆకర్షిస్తోంది. అదే ఒక్సో హోప్. ఇక ఈ ఎలక్ట్రిక్ బైక్ గురించి ఇప్పుడు మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇక ఈ ఎలక్ట్రిక్ బైక్ కి మీరు ఒక్కసారి చార్జింగ్ పెడితే అది ఏకంగా 150 కిలోమీటర్ల స్పీడ్ వెళ్తుందని కంపెనీ పేర్కొంటోంది. ఇంకా అలాగే ఒక కిలోమీటర్‌కు మొత్తం 25 పైసలు ఖర్చు అవుతుందని కూడా తెలియజేస్తోంది. ఇంకా అంతేకాకుండా ఈ ఎలక్ట్రిక్ బైక్ టాప్ స్పీడ్ వచ్చేసి గంటకు 95 కిలోమీటర్లు ఉంటుంది. ఇక ఈ బైక్ ధర విషయానికి వస్త.. రూ. 1,39,999 నుంచి స్టార్ట్ అవుతోంది. ఇది ఎక్స్‌షోరూమ్ ధర. తెలుగు రాష్ట్రాల్లో ఈ బైక్ గరిష్ట ధర వచ్చేసి మొత్తం రూ. 1.6 లక్షల దాకా ఉంది.ఇంకా ఈ బైక్ ని కొనుగోలు చేయాలని భావించే వారు కేవలం రూ. 999తో ఈ బైక్ ని బుక్ చేసుకోవచ్చు. దీన్ని కొనుగోలు చెయ్యాలనుకుంటే మీరు కంపెనీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి బైక్‌ను బుక్ చేసుకోవచ్చు. ఇక ఈ ఎలక్ట్రిక్ బైక్ బ్లాక్, గ్రే, యెల్లో, బ్లూ ఇంకా అలాగే రెడ్ కలర్స్ లో  కస్టమర్లకు అందుబాటులో ఉంది. అలాగే ఈ ఎలక్ట్రిక్ బైక్2ను హోప్ న్యూరాన్ అప్లికేషన్ ద్వారా కూడా మనం ఆపరేట్ చేయొచ్చు.


బైక్ చార్జింగ్ స్టేటస్, రేంజ్ ఇంకా అలాగే బైక షోరూమ్ ఇలా చాలా ఫీచర్లు కూడా ఈ బైక్ ద్వారా పొందొచ్చు. ఈ బైక్ మొత్తం రెండు వేరియంట్లలో లభిస్తుంది.ఇక మీకు ఒక్సోలో 72 వీ బ్యాటరీ ఉంటుంది. దీనికి 3 కేడబ్ల్యూ మోటార్ ని అమర్చారు. అలాగే బీఎల్‌డీసీ హబ్ మోటార్ అనేది కూడా ఉంటుంది. దీని బ్యాటరీ ఫుల్ కావడానికి మొత్తం ఐదు గంటలు పడుతుంది.దేనికి 5 ఇంచుల స్మార్ట్ ఎల్ఈడీ డిస్‌ప్లే కూడా ఉంటుంది. ఇంకా అలాగే ఐపీ 67 రేటింగ్ కూడా ఉంది. అలాగే టెయిల్ లైట్ ,ఇండికేటర్లు, డేటైమ్ రన్నింగ్ లైట్స్ ఇంకా అలాగే హెడ్‌లైట్ వంటివి కూడా ఉన్నాయి. వెహికల్‌పై 3 ఏళ్లు, బ్యాటరీపై 4 ఏళ్లు ఇంకా మోటార్‌పై 3 ఏళ్లు వారంటీ కూడా వస్తుంది.ఈ బైక్ రేంజ్ విషయానికి వస్తే మొత్తం 135 కిలోమీటర్లు వస్తుంది.ఇక అలాగే ప్రో వేరియంట్‌లో అయితే దాదాపు ఇవే ఫీచర్లు ఉంటాయి.ఈ బైక్ రేంజ్ మొత్తం 150 కిలోమీటర్ల దాకా ఉంటుంది. అలాగే ఇందులో ఇంటర్నెట్, జీపీఎస్, బ్లూటూత్, సెక్యూరిటీ ఇంకా అలాగే మొబైల్ యాప్ వంటి ఫీచర్లు కూడా ఉంటాయి. ఇక స్మార్ట్ ఫీచర్లు కూడా ప్రో వేరియంట్‌లోనే అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులకు అందుబాటు ధరలో సూపర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని కొనాలని భావించే వారు ఈ బైక్ ని ట్రై చేయొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: