ఒక వాహనం - రెండు ఇంధనాలు
ఇదేమీ ఒకటి కొంటే మరొకటి ఉచితం అనే   వ్యాపార ప్రకటన కాదు.  కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంఇది. కేంద్ర  రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్గరీ శుక్రవారం  చేసిన ఈ సూచన వాహన యజమానుల పాలిట వరామా ?  శాపమా ? అన్నది ఇప్పడిప్పుడే చెప్పలేక పోవచ్చు. గడ్గరీ  సూచన ప్రాయంగా చేసిన ఈ ప్రకటన మాత్రం  వాహన తయారీ దారులకు కూడా గొంతులో వెలక్కాయ  పడినట్లయింది


  ఇక నుంచి వాహనాలు రెండు రకాల ఇంధనాలు ఉపయోగించుకునే లా తయారవ్వాలని వాహన ఉత్పత్తి దారులకు  సూచనలు  చేశారు. మరో మూడు నాలుగు నెలల్లో ఫ్లెక్స్ ఫ్యూయల్  (ఎఫ్. ఎఫ్. వి)  వాహనాలు  రహదారుల పైకి  రావాలన్నారు. ఇందు సంబంధించిన విధి విధానాలను  విడుదల చేస్తామని గడ్గరీ  తెలిపారు. ఈ ఆర్థి క సంవత్సరం ఆఖరు త్రైమాసికాని కల్లా (మార్చి 2022) ఫ్లెక్స్ ఫ్యూయల్  వాహానాలు   నడపాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు.  రైల్వేలు, మెట్రోలు, దూర ప్రాంతాలకు నడిపే బస్సులు  గ్రీన్ హైడ్రోజన్ తో వినియోగించేలా రహదారుల శాఖ యోచిస్తున్నట్లు మంత్రి తెలిపారు. 2050 నాటికి భారత్ లో అన్నీ ఈవి వాహనాలు మాత్రమే ఉంటాయని గడ్గరీ  తెలిపారు.  కేంద్ర మంత్రి సూచనతో వాహనాల తయారీ  రంగానికి పెద్ద సవాల్ అని  వ్యాపార వర్గాలు వ్యాఖ్యానించాయి.
రహాదారుల భద్రతే కాదు, వాహనం నడిపే డ్రైవర్ల  భద్రత కూడా ముఖ్యమని ఇటీవలే చెప్పిన  నితిన్ గడ్గ రీ తాజా గా చేసిన ప్రకటన భారత్ లో చర్చనీయాంశమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: