బ‌ద్వేల్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు దాదాపు పూర్త‌వ్వ బోతోంది. మొత్తం 12 రౌండ్ల‌లో బ‌ద్వేల్ ఉప ఎన్నిక కౌంటింగ్ నిర్వ‌హించాల్సి ఉంది. ఇప్ప‌టికే ప‌ది రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసింది. బద్వేల్‌ ఉప ఎన్నిక కౌంటింగ్‌ 10వ రౌండ్లు ముగిసే సరికి అబ్యర్ధులకు వచ్చిన మొత్తం ఓట్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి. 10 వ రౌండు పూర్తయ్యే సరికి మొత్తం 1,39,293 ఓట్లు కౌంట్ చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ అభ్య‌ర్థి డాక్ట‌ర్‌ దాస‌రి సుధ కు 1.06 ల‌క్ష‌ల ఓట్లు వ‌చ్చాయి. బీజేపీ అభ్యర్థి సురేష్‌కు  20583 ఓట్లు వ‌చ్చాయి. ఇక మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అబ్య ర్థి కమలమ్మ కు 5968 ఓట్లు వ‌చ్చాయి. విచిత్రం ఏంటంటే  10 వ రౌండు ముగిసే సరికి మొత్తం నోటా కు ఏకంగా 3464 ఓట్లు వ‌చ్చాయి. వైసీపీకి ఇప్ప‌టికే 90 వేల ఓట్ల మెజార్టీ వ‌చ్చింది. ఇదిలా ఉంటే బీజేపీ 21 వేల ఓట్లు సాధించ‌డం అంటే మామూలు విష‌యం కాదు. ఆ పార్టీ ముందు నుంచే 18500 ఓట్లు వ‌స్తాయ‌ని చెప్పింది. ఆ అంచ‌నాలు సాధించి గెలిచామ‌ని ఫ్రూవ్ చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: