ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొవిడ్ మ‌హ‌మ్మారి రోజురోజుకూ త‌గ్గుముఖం ప‌డుతోంది. గ‌డిచిన 24 గంటల్లో 6,617 కరోనా కేసులు నమోద‌వ‌గా, 57 మంది మృతిచెందారు. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 18,26,751కు చేరింది. అలాగే కరోనాతో మ‌ర‌ణించిన‌వారి సంఖ్య 12,109గా ఉంది. ప్ర‌స్తుతానికి రాష్ట్రంలో 71,466 యాక్టివ్ కేసులుండ‌గా, 24 గంటల్లో 10,228 మంది మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్నారు. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో తొమ్మిది మంది చొప్పున మ‌హ‌మ్మారికి బ‌ల‌య్యారు. తూర్పుగోదావ‌రి జిల్లాలో 1397 కేసులు న‌మోద‌వ‌గా, క‌ర్నూలులో 217 కేసులు న‌మోద‌య్యాయి. అయితే కేసుల సంఖ్య‌ను ప్ర‌భుత్వం రోజురోజుకూ త‌గ్గించి చెపుతోందంటూ ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నారు. క‌రోనా కార‌ణంగా మృతిచెందిన‌వారి కుటుంబాల‌కు ఆర్థిక స‌హాయం అందించాల్సి వ‌స్తుంద‌నే కారణంతోనే ప్ర‌భుత్వం ఇలా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని, వాస్త‌వానికి రాష్ట్రంలో కేసులు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని, సంఖ్య‌లో దేశంలోని మొద‌టి ఐదురాష్ట్రాల్లో ఒక‌టిగా ఉంద‌ని చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

tag