తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఎన్ని వివాదాలు జ‌రుగుతున్నా.. ఎవ‌రెటు పోతున్నా ఆయ‌న మాత్రం త‌న మానాన తాను పోతారు. ఏమా మాట్లాడ‌రు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీలా, మాజీ ప్ర‌ధాన‌మంత్రి మ‌న్మోహ‌న్‌సింగ్‌లా ఆయ‌న కూడా మౌనంగా ఉంటారు. అన్నీ చూస్తూ ఉంటారు. ఏమీ స్పందించ‌రు. బ‌హిరంగంగానే సుమా!. తెర‌వెన‌క మాత్రం స్పందిస్తారు. తెర‌ముందు స్పందిస్తే ప్ర‌జ‌ల్లో ఒక‌ర‌క‌మైన అభిప్రాయం ఏర్ప‌డే ప్ర‌మాదం ఉంటుంది.  వారు ప‌లుర‌కాలుగా విశ్లేషించుకుంటారు. మ‌న‌పై ఉండే అభిమానం దెబ్బ‌తింటుంది అనే ఆలోచ‌న‌వ‌ల్ల కాబోలు ఆయ‌న ఏమీ మాట్లాడ‌రు. ఏం చేసినా, ఏం చేయాల‌న్నా అన్నింటికీ తెర‌వెన‌క ప్రాంగ‌ణాన్నే ఎంచుకుంటారు. అక్క‌డినుంచే రాజ‌కీయాలు న‌డుస్తాయి. అక్క‌డినుంచే ప‌రిశ్ర‌మ‌లో విభేదాలు త‌లెత్తుతాయి. తెర‌ముందు మాత్రం ఆయ‌న మాములుగా ఉంటారు. ఒక చిరున‌వ్వు న‌వ్వుతారు. లేదంటే ఒక పోస్టు పెడ‌తారు. అంతా బాగానే ఉంది.. ప‌రిశ్ర‌మ‌లో మ‌న‌కు ఎదురులేదు అని అనుకుంటున్న త‌రుణంలో త‌గిలిన ఎదురుదెబ్బ‌కు ఒక‌ర‌కంగా మైండ్ బ్లాకైంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఇటువంటి షాక్‌ను ఆయ‌న కూడా ఊహించి ఉండ‌ద‌రు. వెంట‌నే స్పందించారు తెర‌వెన‌క‌. పావులు క‌దిపారు. అవే ఇప్పుడు చూస్తున్న రాజీనామాల ప‌ర్వం..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

maa