కూటమి అభ్యర్థులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు వారికి దిమ్మతిరిగే చిట్కా చెప్పారు. 175 అసెంబ్లీ, 25పార్లమెంట్ స్థానాల అభ్యర్థులతో చంద్రబాబు, పురంధరేశ్వరి, నాదెండ్ల మనోహర్  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మూడు పార్టీల ఓట్లు  కూటమి అభ్యర్థికి బదిలీ అవ్వాలని నేతల దిశానిర్దేశం చేశారు. నిలబడిన అభ్యర్థి ఏ పార్టీ నేతైనా  కూటమి అభ్యర్థిగానే భావించాలని సూచించారు.


వైసీపీ కుట్రలను 200మంది కూటమి అభ్యర్థులు ధీటుగా తిప్పికొట్టాలన్న ముగ్గురు నేతలు.. రానున్న రోజుల్లో వైసీపీ మరిన్ని కుట్రలకు తెరలేపే అవకాశం ఉందని అభ్యర్థుల్ని అప్రమత్తం చేశారు. ఇదే సమయంలో చంద్రబాబు వారికి ఓ అద్భుతమైన చిట్కా చెప్పారు. ఎన్నికల ప్రచారంలో మూడు పార్టీల నేతలు కలిసి పాల్గొనాలన్న చంద్రబాబు.. ప్రతీ అభ్యర్థి తప్పనిసరిగా మూడు పార్టీల కండువాలు ధరించి ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. మరి ఈ చిట్కా ఎంత వరకూ ఫలిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: