ఇటీవల కాలం లో ప్రపంచం మొత్తం టెక్నాలజీ వెంట పరుగులు పెడుతూ ముందుకు సాగుతూ ఉన్న సమయంలో కొంతమంది మాత్రం ఇంకా మూఢనమ్మకాల మాయ లో  మునిగి పోతూ వెనక్కి నడుస్తూ ఉన్నారు. ప్రపంచం తో మాకు సంబంధం లేదు అన్న విధంగానే వ్యవహరిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇంకా పిచ్చి నమ్మకాలను వదులుకోవడం లేదు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయి అని ఇంకా ఎంతో మంది నమ్ముతున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఫేక్ స్వామీజీలు వచ్చి ఇంట్లో పూజలు చేస్తే కోటీశ్వరుడు అవుతారంటే చాలు అందరూ గుడ్డిగా నమ్మేస్తున్నారు.


 పొలంలో గుప్తనిధులు ఉన్నాయి అని చెబితే నమ్మి చివరికి మోసపోతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. అంతేకాదు ఏకంగా గుప్త నిధులు  ఉన్నాయన్న మాట నమ్మి నరబలి ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి. ఇక ఇటీవల కాలంలో ఇలాంటి తరహా ఘటనలు  తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి అని చెప్పాలి. వికారాబాద్ జిల్లాలో కూడా ఇలాంటి తరహా కట్టిన వెలుగు చూసింది. పరిగి మండలం సుల్తాన్పూర్ లో తులసి రామ్ నాయక్ అనే వ్యక్తి తన సొంత పొలంలో అర్ధరాత్రి తవ్వకాలు జరపడం  స్థానికుల గమనించారు.


 ఈ క్రమంలోని సదరు  వ్యక్తితో పాటు అక్కడ క్షుద్రపూజలు నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను దారుణంగా చితకబాదారు. అయితే ఆ తర్వాత అక్కడ గుప్త నిధుల కోసం  తవ్వకాలు జరుపుతున్నారు అన్న విషయం తెలిసి అందరూ షాక్ అయ్యారు అని చెప్పాలి. తులసి రామ్ నాయక్  పై దాడిని అడ్డుకోవడానికి వచ్చిన అతని కుటుంబ సభ్యులను సైతం తండావాసులు దారుణంగా దాడి చేసి కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని దాడి చేసిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. దాడిలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: