ఇక తక్కువ ఆహారం తినడం, అలాగే తినడం తగ్గించడం వల్ల బరువు తగ్గుతారనుకోవడం సరికాదు. అందుకు బదులుగా ఎక్కువ ఆకలి అయ్యేవరకు వేచి ఉండటం మంచిది. బాగా ఆకలిగా ఉన్నప్పుడే ఆహారం తీసుకోవడం ద్వారా శరీర బరువు చాలా తొందరగా తగ్గుతుంది.ఇక బరువు తగ్గాలనుకునేవారు ఈ విధానాన్ని ఖచ్చితంగా అలవాటు చేసుకోండి. అతిగా తినడాన్ని తగ్గించి బాగా ఆకలితో ఉన్న సమయంలో శరీరానికి సరిపడా తినాలి. ఇక అలాగే ఒకేసారి ఎక్కువగా తినకూడదు.పండ్లు, సలాడ్లు, జ్యూస్‌లు కనీసం రోజుకి ఒకసారైన తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.ఇక మంచి గాఢ నిద్రను ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే, జీవిత కాలం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే.. ఎనిమిది గంటల పాటు నిద్ర తప్పనిసరిగా పోవాలి.అలాగే ప్రతీ రోజూ ఎక్కువసేపు పడుకున్నా..ఇంకా తక్కువ సమయం నిద్రపోయినా.. ఆరోగ్యానికి చాలా హానీకరం.ఈ సమస్య ఊబకాయానికి దారితీస్తుంది. అంతేగాక అనేక వ్యాధుల బారిన పడేందుకు కూడా దోహదపడుతుంది.

ఇక అలాగే చాలా మందికి పొద్దున్నే నిద్ర లేచిన వెంటనే బెడ్‌ టీ తాగడం అలవాటు. కానీ బెడ్ టీ తాగే అలవాటు మీ ఆరోగ్యానికి పెద్ద శత్రువు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఉదయాన్నే బెడ్ టీ తాగడం వల్ల గ్యాస్, అల్సర్ సమస్యలు అనేవి పెరుగుతాయి. ఇక ఖాళీ కడుపుతో చక్కెర పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా ఊబకాయం పెరుగుతుంది. ఇక టీ కి బదులుగా గోరువెచ్చని నీటితో రోజును ప్రారంభించే అలవాటు చేసుకోండి. ఇలా ఇక ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో ఒకటి నుంచి నాలుగు గ్లాసుల గోరువెచ్చని నీరు త్రాగాలి.ఇక శారీరక శ్రమ లేకపోవడం వల్ల శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. అలాగే గర్భాశయ సమస్యలు, ఆర్థరైటిస్, వెన్నునొప్పి, సయాటికా వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అందుకే.. ఈ జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే.. ప్రతీ రోజూ ఉదయమే మేల్కోవాలి. కొంత సమయాన్ని వ్యాయామం కోసం కేటాయించి మన ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: