123 రోజులు సంకెళ్ళతో ప్రేమజంట..! ఏ పని చేసినా కలిసే చేశారు..?

ప్రేమ ఈ రెండు అక్షరాలలో ఏదో మాయ ఉంది.  కొడుకు తండ్రి పై ప్రేమ,  తల్లికి బిడ్డ పై ప్రేమ,  ఈ మానవ సమాజంలో ప్రేమానురాగాలు లేని దేశం దేశం అంటూ లేదు. ప్రేమ అనేది ఒక మానవులకే పరిమితం కాలేదు.  పక్షులకు, జంతువులకు కూడా ఉంటుంది.  ఈ ప్రేమానురాగాలను ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రదర్శించుకుంటారు.  కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా  బంధాన్ని మరింత బలపరిచేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాంటి ఓ సంఘటనే తాజాగా ఉక్రెయిన్ కు చెందిన ప్రేమ జంట అలెగ్జాండర్ కుడ్లీ,  విక్టోరియా పిస్టోవితోవ అనే జంట తమ  బంధాన్ని  బలపరచుకొనే ప్రయత్నంలో ప్రేమికుల దినోత్సవం రోజున చేతికి సంకెళ్లు వేసుకొని ప్రయోగం మొదలుపెట్టింది.


 చివరికి 123 రోజుల తర్వాత ఈ జంట తమ చేతి సంకెళ్లను ఉక్రెయిన్ కు చెందిన ఓ టీవీ ఛానల్ ముందు తొలగించారు.  అయితే వీరు సంకెళ్ళు వేసుకొని కిరాణా షాప్కు మొదలు బాత్రూమ్ షవర్ చేసుకోవడం వరకు ప్రతి పని కలిసి చేశారన్నది ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ ప్రయోగంతో వాళ్లు కొంత అసౌకర్యాన్ని గురైన మంచి అనుభూతిని ఇచ్చిందని అంటున్నారు.   ఈ విధంగా కలిసి ఉండటంతో  తన ప్రియుడు తనపై అంత శ్రద్ధ చూపలేదని  ఆమె తెలిపింది.  తమ బంధాన్ని మరింత ప్రేమగా మలచుకోవడానికి  ఇలా చేసినందుకు అలెగ్జాండర్ బాధపడుతున్నట్లు చెప్పాడు.

  కొన్నిసార్లు విక్టోరియాకు కోపం వచ్చేదని అన్నాడు. అదే విధంగా ఇలాంటి ప్రయోగం ఉక్రెయిన్, ఇతరాత్ర జంటలు చేయక పోవడం మంచిదని సలహా ఇచ్చాడు. అయితే ఈ జంట తమ చేతి సంకెళ్లను ఆన్లైన్ వేలంలో విక్రయించి,  ఆ వచ్చిన డబ్బును కొంత స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇవ్వాలని భావిస్తున్నట్లు వారన్నారు.  కాగా ఈ మొత్తం  సమాచారాన్ని ఉక్రెయిన్ టెలివిజన్,  సోషల్ మీడియాలో డాక్యుమెంట్ గా తయారు చేశారు.  ప్రపంచంలోనే ఏ జంట ఇలాంటి ఘనత సాధించలేదని ఉక్రెయిన్ రికార్డు బుక్ కు చెందిన ప్రతినిధి ప్రశంసల వర్షం కురిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: