మన హీరోలు ఇటీవల కాలంలో కేవలం యాక్షన్ సీన్స్ సెంటిమెంట్ సీన్స్ మాత్రమే కాకుండా కామెడీ సీన్స్ కూడా బాగా చేస్తూ తమ సినిమా లతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రతి ఒక్క హీరో ఆ విధంగా చేస్తూ తమ నైపుణ్యాన్ని పెంచుకుని ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తున్నారు. ఆవిధంగా ప్రభాస్ లోని కామెడీ యాంగిల్ ని గుర్తించిన సినిమా బుజ్జి గాడు.  పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కె.ఎస్.రామారావు నిర్మించిన ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటించగా 2008లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 విదేశాల్లో సైతం ఈ సినిమా రీమేక్ అయ్యి అక్కడ కూడా సూపర్ హిట్ సాధించి అందరికీ మంచి పేరు తెచ్చింది. ఈ సినిమాతో ప్రభాస్ సరికొత్త నటుడు గా ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా లో తాను గతంలో ఎప్పుడూ లేని విధంగా మంచి కామెడీ రోల్ చేశాడని చెప్పవచ్చు. పూరి జగన్నాథ్ సినిమాలో హీరో అంటే చాలా వెరైటీగా ఉంటాడు. రెగ్యులర్ సినిమాలలో లాగా హీరో ఫైట్లు సెంటిమెంట్ సీన్ లలో మాత్రమే కాకుండా కామెడీ సీన్ లలో కూడా నటింప చేస్తూ  ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ ఉంటాడు.

ఈ నేపథ్యంలోనే ఆయన బుజ్జిగాడు సినిమా చేయగా ఈ సినిమా ప్రభాస్ కెరియర్ లోనే నటుడిగా మంచి సంతృప్తినిచ్చింది అని చెప్పవచ్చు.  చిన్నప్పుడు తన ప్రియురాలిని కోల్పోయిన హీరో  పెద్దయ్యాక ఎలా ఆమెను తిరిగి దక్కించుకున్నాడు. ఈ దక్కించుకునే క్రమంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనేది ఈ సినిమా కథ. దీనిలో మంచి యాక్షన్ తో పాటు మరింత కామెడీని చొప్పించి సినిమా చేశాడు పూరీ జగన్నాథ్. మోహన్ బాబు కీలక పాత్రలో నటించగా సంజన మంచి గ్లామర్ పాత్ర పోషించి ప్రేక్షకులను అలరించింది.  ఆలీ, కోట శ్రీనివాసరావు లాంటి హేమాహేమీలు నటించిన ఈ చిత్రానికి సంగీతం సందీప్ చౌత అందించగా పాటల పరంగా కూడా ఈ చిత్రం ప్రేక్షకులను ఉర్రూతలూగించింది అని చెప్పవచ్చు. సినిమా ఫలితం కొంత తేడా వచ్చినా కూడా నటుడిగా వందకు వంద శాతం ప్రభాస్ ను సరికొత్త రూపంలో చూపించిన సినిమాగా బుజ్జిగాడు నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: