రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పెట్టి భారీ బడ్జెట్ మూవీ లలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇలా ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ లలో  సలార్ మూవీ ఒకటి. ఈ మూవీ కి కే జి ఎఫ్ మూవీ తో దర్శకుడిగా పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపును సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తుండగా , శృతి హాసన్మూవీ లో ప్రభాస్ సరసన హీరోయిన్ గా కనిపించబోతోంది. ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో పృథ్వి రాజ్ సుకుమారన్  కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి రవి బుస్రుర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం వరకు సలార్ చిత్ర బృందం డిసెంబర్ లోపు ఈ మూవీ మొత్తం షూటింగ్ ని పూర్తి చేయాలి అని ప్రణాళికలను వేసుకుంది. కాక పోతే ప్రస్తుతం షూటింగ్ ల బంద్ కారణంగా సలార్ చిత్ర బృందం ప్రణాళికలు వేసుకున్న ప్రకారం డిసెంబర్ లోపు ఈ మూవీ షూటింగ్ పూర్తి పూర్తి కావడం చాలా కష్టం.

ఈ నెల చివరన కానీ లేదా సెప్టెంబర్ లో కానీ సలార్ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. దానితో సలార్ సినిమా షూటింగ్ 2023 మార్చి వరకు పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా షూటింగ్ ల బంద్ కారణంగా సలార్ మూవీ మేకర్స్ సలార్ సినిమా షూటింగ్ విషయంలో వేసుకున్న ప్రణాళికలు అన్నీ తారుమారు అయ్యాయి. ఇది ఇలా ఉంటే దర్శకుడు ప్రశాంత్ నీల్ 'సలార్' మూవీ ని అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్ లతో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లోని యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయే రేంజ్ లో ఉండనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: