టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు సెప్టెంబర్ 11న కన్నుమూశారు. తెలుగు సినీ పరిశ్రమలో ఆయన రారాజుగా వెలిగారు. ఆయన తీసిన చిత్రాలు ఇప్పటికి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా మిగిలిపోయాయి.


క్షత్రియుల కుటుంబానికి చెందిన ఆయనకు పెద్దల ద్వారా వచ్చిన ఆస్తులు ఎక్కువే. వారి స్వస్థలం ఏలూరు జిల్లా మొగల్తూరు. అక్కడ ఇప్పటికి కృష్ణంరాజు కోసం ఓ రాజభవనం కూడా ఉందట.. తమ పూర్వీకుల ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. వాటిని వారి సమీప బంధువులే చూసుకుంటారు. సినిమాల్లో అడుగు పెట్టడానికి ముందే వారికి ఎన్నో కోట్ల ఆస్తులున్న సంగతి విధితమే. రాజుల వంశం కావడంతో వారి ఆస్తులు పెరిగిన మాట కూడా వాస్తవమే.


కృష్ణం రాజు సినిమాల్లోకి వచ్చిన తరువాత గోపికృష్ణ మూవీస్ సంస్థను స్థాపించి పలు చిత్రాలు కూడా నిర్మించారు. దీంతో కూడా ఆయన ఆస్తులు రెట్టింపయ్యాయి. దాదాపు ఐదు దశాబ్దాలు తనదైన నటనతో అందరిని కూడా మెప్పించారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించి తన సత్తా చాటుకున్నారు. అలా తన ఆస్తులను క్రమంగా పెంచుకున్నారు. మొగల్తూరులో ఓ రాజభవనం, జూబ్లీహిల్స్ లో ఉన్న భవనం విలువ రూ. 18 కోట్ల వరకు ఉంటుంది. ఇంకా ఆయన పేరిట పలు ఆస్తులు కూడా ఉన్నట్లు సమాచారం.


కృష్ణంరాజు దగ్గర రూ. 90 లక్షల విలువ చేసే మెర్సిడెజ్ బెంజ్ కారు, రూ. 40 లక్షల విలువ చేసే టొయోటా ఫార్చునర్, రూ. 90 లక్షల విలువ ఉన్న వోల్వో ఎక్స్ సీ కార్లు ఉన్నాయి. 2009 లోక్ సభ ఎన్నికల్లో ఆయనకు రూ. 8.62 కోట్ల ఆస్తులు, రూ.2.14 కోట్ల అప్పులు ఉన్నట్లు చూపించారట.. అంతేకాదు తన కుటుంబానికి 4 కిలోల బంగారం ఉంది. దీని విలువ రూ. 200 నుంచి రూ.300 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అలా కృష్ణంరాజుకు ఉన్న ఆస్తుల విలువ తెలిస్తే షాకే. రాజుల కుటుంబం కావడంతోనే తమ పూర్వీకుల ద్వారా వచ్చిన ఆస్తులు కాకుండా తాను కూడా స్వయంగా సినిమాల్లో చేరి సంపాదించుకోవడంతో ఆస్తులు బాగా పెరిగాయి.


 

కృష్ణంరాజు భక్తకన్నప్ప, తాండ్రపాపారాయుడు, రంగూన్ రౌడీ, ధర్మాత్ముడు, ధర్మతేజ, మరణశాసనం, బొబ్బిలిబ్రహ్మన్న లాంటి చిత్రాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. రెబల్ స్టార్ గా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. రౌద్రమైన నటనతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సాధించుకున్న నటుడు ఆయన . కృష్ణంరాజు అందరితో ఎంతో కలివిడిగా ఉండేవారు. ఎంతోమందితో కలిసి నటించారు. ఒక ఊరి వారైన చిరంజీవితో కలిసి కూడా ఆయన పలు చిత్రాలు చేశారు. మనవూరి పాండవులు, పులిబెబ్బులి చిత్రాల్లో ఇద్దరు పోటీపడి మరి నటించడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: