టాలీవుడ్ హీరో అక్కినేని అఖిల్ చాలా గ్యాప్ తీసుకొని మరీ లెనిన్ అనే సినిమాలో నటించారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ మురళీ కిషోర్ డైరెక్షన్లో తెరకెక్కించారు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత నాగ వంశీ భారీ బడ్జెట్ తోనే నిర్మించారు. ఇందులో హీరోయిన్గా శ్రీ లీలను ఎంపీక  చేయగా కొంత భాగం వరకు షూటింగ్ పూర్తి అయ్యింది. అయితే ఈమె డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల ఈ సినిమా నుంచి తొలగించినట్లు సమాచారం. ఇప్పుడు ఆమె ప్లేస్ లో హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే ను ఎంపిక చేసి రిషూట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

దాదాపుగా ఈ సినిమా షూటింగ్ 80% పూర్తి అవ్వగా త్వరలోనే ఈ సినిమా చివరి షెడ్యూల్ ని కూడా పూర్తి చేయబోతున్నారు. అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి గ్లింప్స్, పోస్టర్ ను విడుదల చేయగా  ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అభిమానులు కూడా ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అంటూ ఎదురు చూశారు. ఈ క్రమంలోనే లెనిన్ సినిమాకు సంబంధించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు త్వరగా పూర్తిచేసి నవంబర్ 17వ తేదీన ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు . ఇందుకు  సంబంధించి త్వరలోనే అధికారికంగా ప్రకటనను చిత్ర బృందం ప్రకటించే అవకాశం ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈసినిమా విషయంలో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నప్పటికీ, ఇప్పుడు రిలీజ్ డేట్ వైరల్ గా మారడంతో ఆనంద పడుతున్నారు. అఖిల్ విషయానికి వస్తే ఈ ఏడాది జూన్ 6న జైనబ్ రావడ్జీ నీ వివాహం చేసుకున్నారు. ఇక వివాహం అనంతరం అఖిల్ నటిస్తున్న లెనిన్ సినిమా విడుదల కాబోతోంది. మరి ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: