ఏంటి.. బాలయ్యతో రొమాన్స్ చేసిన ఆ హీరోయిన్ పెళ్లి చేసుకోబోతుందా? అదేంటి సోషల్ మీడియాలో ఎలాంటి హడావిడి లేకుండానే ఆమె పెళ్లి జరిగిపోతుందా? వరుస అవకాశాలు వస్తున్నప్పటికీ ఇప్పుడు ఆ హీరోయిన్ కి పెళ్లి ఆలోచన ఎందుకు వచ్చింది.. అయినా పెళ్లి చేసుకునే ముందు కనీసం అభిమానులకు కూడా చెప్పదా? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బాలయ్య హీరోయిన్ కు సంబంధించి ఇలాంటి పోస్టులే దర్శనమిస్తున్నాయి అని చెప్పాలి. ఇంతకీ ఇలా పెళ్లికి సిద్ధమైన బాలయ్య హీరోయిన్ ఎవరో తెలుసా ఇటీవల బ్లాక్ బస్టర్ సాధించిన అఖండ సినిమాలో బాలయ్యతో రొమాన్స్ చేసిన ప్రగ్యా జైశ్వాల్.


 ఈ హాట్ బ్యూటీ మరికొన్ని రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతుందట. తన చిన్ననాటి ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. ప్రగ్యా జైస్వాల్ సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా పరిశ్రమ చాలా కాలమే అవుతుంది. కానీ పెద్దగా సూపర్ హిట్ లు మాత్రం ఖాతాలో వేసుకోలేదు. కానీ బాలయ్య సరసన నటించి బ్లాక్ బస్టర్ సాధించింది ఈ ముద్దుగుమ్మ. గతంలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తో ప్రేమాయణం నడిపి కొన్నాళ్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. చివరికి ఆ డైరెక్టర్ కు పెళ్లి కావడంతో ఇక కెరియర్ పై దృష్టి పెట్టిన ఈ ముద్దుగుమ్మ కొన్ని సినిమాలు చేసింది.


 అయితే ఈ పెళ్లికి సంబంధించి అటు టాలీవుడ్ లో ఎవరికి సమాచారం లేదు అన్నది తెలుస్తుంది. తన చిన్ననాటి ఫ్రెండ్ ని కేవలం కొంతమంది బంధుమిత్రుల మధ్య పెళ్లి చేసుకోబోతుందట ప్రగ్యా జైస్వాల్. ఇక ఈ విషయం తెలిసి షాక్ అవుతున్నారు ఫ్యాన్స్. అదేంటి ప్రగ్యా జైస్వాల్ మరీ ఇంత రహస్యంగా పెళ్లి చేసుకుంటుందా అని ఆశ్చర్యపోతున్నారు అని చెప్పాలి. అయితే అఖండతో మంచి క్రేజ్ సంపాదించుకున్న ప్రగ్యా జైస్వాల్  ఇంకా కొన్నాళ్లువెయిట్ చేయడం లేదు అన్న బాధ ఉన్నప్పటికీ.. చివరికి పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతుందన్న ఫీలింగ్ తో ఫాన్స్ ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: