ఈ సినిమాకి అక్కడ కూడా లారెన్స్ దర్శకత్వం వహిస్తాడట. సౌత్ కధలను హిందీ లో రీమేక్ చేసి, హిట్లు కొట్టడం ప్రభుదేవాకి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు లారెన్స్ కూడా ప్రభుదేవా బాటలోనే వెళ్తున్నాడు. నిజానికి హిందీ లో ఓ సినిమా చేయాలని ఎప్పటినుంచో లారెన్స్ ప్లాన్ చేస్తున్నాడు.
అయితే రెబల్ సినిమా దారుణంగా దెబ్బ కొట్టడంతో బాలీవుడ్ కల ని కాసేపు పక్కన పెట్టాడు. ఇప్పుడు వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు - హిందీ అవకాశం లారెన్స్ ని వెతుక్కుంటూ వచ్చింది. ప్రభుదేవాలా హిట్టు కొడతాడో, లేదంటే అలవాటు ప్రకారం చేతులు ఎత్తేస్తాడో చూడాలి.