అందాన్ని చూస్తే ఎవరికైనా ఆనందమే కదా.. అదే ఆనందం ఓ అందమైన ప్రాణి.. మరో అందాన్ని చూసినా ఆనందమే.. అవును మరి అందాల హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్.. ప్రకృతి అందాలను చూస్తూపరవశించి పోతుంటే.. ఆ అందాల ఆనందాన్ని మరో అందమైన దృశ్యంగా బంధించిందో కెమేరా. ప్రకృతిని స్త్రీతో పోల్చారు పాతకాలం కవులు.. అప్పుడెప్పుడో ఆకులో ఆకునై పూవులో పూవునై అంటూ.. మేఘ సందేశం సినిమాలో జయసుధ అమాయకంగా పాడుకున్న పాట గుర్తుకొస్తోంది ఈనాటి అనుపమ పరమేశ్వరన్ ఫోటో షూట్ చూస్తుంటే..


ప్రకృతి అందాల్లో దాగిపోయి అనుపమ ఇచ్చిన ఫోజులు చూస్తుంటే.. ప్రకృతి, స్త్రీ కలగలసిన అందం ఆవిష్కృతమవుతోంది. ఎప్పుడూ హాట్ హాట్ అందాలతోనో.. లేకపోతే..లేటెస్ట్ మూవీ స్టిల్స్ పోస్టు చేసే అనుపమ.. తాజాగా పోస్టు చేసిన ఫోటో రమణీయంగా ఉంది. ఆమె మోములో తాండవిస్తున్న ఆనందమే ఫోటోను మరింతగా అందంగా మార్చింది.


అదిరే అందాలు.. చక్కటి అభినయం ఉన్నా అనుపమకు పెద్దగా ఛాన్సులు రావడం లేదు. ఈ మ‌ధ్యే తెలుగులో రాక్షసుడు సినిమా చేసింది అనుపమ. ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చినా కలెక్షన్లు మాత్రం అంతగా రాలేదు. ఇండస్ట్రీలో అందాలు ఆరబోయడం ఇష్టం ఉండని అతికొద్ది మంది హీరోయిన్లలో అనుపమ ఒకరు. అ..ఆ సినిమాతో తెలుగు వాళ్లకు ప‌రిచ‌య‌మైన ఈ బ్యూటీ.. ఆ త‌ర్వాత ప్రేమ‌మ్, శ‌త‌మానం భ‌వ‌తి సినిమాల‌తో వ‌ర‌స విజ‌యాలు అందుకుంది.


అప్పట్లో గోల్డెన్ లెగ్ అనిపించుకుంది. ఆ త‌ర్వాత మాత్రం అదే జోరు కొన‌సాగలేదనుకోండి. అనుప‌మ ప‌ర‌మేశ్వరన్ కు ఇప్పుడు ఏ భాషలోనూ పెద్దగా సినిమాల్లేవు. దాంతో ఇదిగో ఇలా ఫోటోల్లో అందాలు ఆరబోస్తూ.. ఫోటో షూట్లు చేస్తూ గడపేస్తోంది. తను, తన అందం సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. మరి అవకాశాలు ఎప్పుడు వస్తాయో చెప్పలేం.


మరింత సమాచారం తెలుసుకోండి: