తమిళ స్టార్ హీరో,ఇళయదళపతి విజయ్, ఖైదీ ఫేమ్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం మాస్టర్. సెట్స్ మీదకు వెళ్ళినప్పటినుండి నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకోవడంతో నిన్నటితో చిత్రీకరణ మొత్తం కంప్లీట్ అయ్యింది. ఈ చిత్రం నుండి ఇంతకుముందు ఫస్ట్, సెకండ్ ,థర్డ్ లుక్ పోస్టర్లు విడుదలవ్వగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇటీవలే ఈ సినిమానుండి మొదటి సాంగ్ కుట్టి స్టోరీ విడుదలై ఆకట్టుకుంది. అతి త్వరలో ఈ సాంగ్ తెలుగు వెర్షన్ కూడా రానుంది. 
 
యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ గా కనిపించనుండగా పేట ఫేమ్ మాళవిక మోహనన్ హీరోయిన్ గా  నటించింది. వీరితోపాటు ఆండ్రియా జెర్మియా ,అర్జున్ దాస్, శంతన్  భాగ్యరాజ్ ముఖ్య పాత్రలు పోషించారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నఈ చిత్రాన్ని ఎక్స్ బి క్రియేటర్ బ్యానర్ పై బ్రిట్టో నిర్మిస్తున్నాడు. ఈచిత్రం ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పూర్తి చేసుకుంది. థియేట్రికల్ , నాన్ థియేట్రికల్ కలిపి సుమారు 250కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని టాక్ తద్వారా విజయ్ కెరీర్ లో హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా మాస్టర్ రికార్డు సృష్టించింది. 
 
ఇక ఈచిత్రాన్ని తెలుగులో యువ నిర్మాత mahesh KONERU' target='_blank' title='మహేష్ ఎస్ కోనేరు -గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మహేష్ ఎస్ కోనేరు విడుదలచేయనున్నాడు. ఈ హక్కుల కోసం మహేష్ 9కోట్లు చెల్లించాడట. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేట్రికల్ హక్కుల కోసం డిస్ట్రిబ్యూటర్లు భారీగా ఆఫర్ చేస్తున్నారని సమాచారం. ఏప్రిల్ 10 గుడ్ ఫ్రైడే రోజున ఈ చిత్రం విడుదలకానుందని సమాచారం. తమిళ్ తోపాటు తెలుగులోనూ ఈచిత్రం పై భారీ అంచనాలు వున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: