టాలీవుడ్ దిగ్గజ నటుడు మెగాస్టార్ చిరంజీవి మూడేళ్ళ క్రితం వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమా తో నటుడిగా సినిమా పరిశ్రమకు రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ తో మెగాస్టార్ తనకు మధ్యలో టైం గ్యాప్ వచ్చిందే తప్ప, రికార్డ్స్ కొట్టే టైమింగ్ లో మాత్రం కాదంటూ మరొక్కసారి రుజువు చేసారు. ఇక దాని తరువాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఆయన నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా ఆశించిన రేంజ్ లో సక్సెస్ సాదించనప్పటికీ ఆ సినిమాలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గా మెగాస్టార్ ఎంతో అత్యద్భుతమైన నటనను కనబరిచారు. ఇక ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాలో ఆయన హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. 

 

ఇక తన సినిమాలతో పాటు మరోవైపు ఎవరైనా ఇతర నటీనటులు చేస్తున్న సినిమాలకు అవసరమైనపుడు తన వంతుగా సాయం అందిస్తూ మంచి మనసుతో ముందుకు సాగుతుంటారు మెగాస్టార్. ఇక నేడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ తనయుడు సంజయ్ హీరోగా పరిచయం అవుతున్న ఓ పిట్ట కథ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసి సినిమా యూనిట్ కి ముందస్తు అభినందనలు తెలియచేయడం జరిగింది. ఇక ఆ వేడుకలో మెగాస్టార్ మాట్లాడుతూ, బ్రహ్మాజీతో తనకు మంచి అనుబంధం ఉందని, ఇక ఆయన కుమారుడి లాంచింగ్ సినిమా కావడంతో తప్పకుండా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడానికి నేను రెడీ అని చెప్పానని అన్నారు. 

 

ఇక సినిమా ట్రైలర్ చూస్తుంటే ఎంతో బాగుందని, తప్పకుండా సినిమా మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటూ సినిమా యూనిట్ కి మెగాస్టార్ బెస్ట్ విషెస్ తెలిపారు. ఇక మధ్యలో తాను, కొరటాల దర్శకత్వంలో నటిస్తున్న సినిమా విషయం మాట్లాడిన మెగాస్టార్, ఆ సినిమా పేరును ఆచార్య అని ప్రస్తావించడంతో, ఆ సినిమాకు అదే టైటిల్ పెట్టనున్నట్లు ఆల్మోస్ట్ అందరికీ అర్ధమయిపోయింది. దానితో ఆ టైటిల్ పలు మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది. కాగా ఈ టైటిల్ కొద్దిరోజలుగా పలు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే...!!

మరింత సమాచారం తెలుసుకోండి: