యాంక‌ర్ ర‌వి.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.తెలియని వారు ఉంటారంటే అతిశయోక్తి కానే కాదు. తెలుగు బుల్లితెర‌పై త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు ఈ యాంక‌ర్. ప్రేక్షకులను ఆకట్టుకునే అంతలా తన ప్రభావాన్ని చూపిస్తున్నాడు యాంకర్ కమ్ యాక్టర్. బుల్లితెరపై వచ్చే ఎన్నో షోలలో తనదైన కామెడీని పండిస్తూ దూసుకుపోతున్న రవి.. వెండితెర పైనా మెరిశాడు. ఒక సినిమాలో హీరో గా కూడా నటించాడు. అంతేకాదు, ఎన్నో సినిమా ఫంక్షన్లను కూడా హోస్ట్ గా చేశాడు.జీ తెలుగు లో ప్రసారమయ్యే చాలా ఈవెంట్స్ కి యాంకర్ గా వ్యవహరించాడు  రవి. దీంతో రవి బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే అతడు తెలుగు రాష్ట్రాల్లోనే వన్ ఆఫ్ ది టాప్ మేల్ యాంకర్ అయిపోయాడు. అయితే వ్యాఖ్యాత‌గా ఎంత క్రేజ్ తెచ్చుకున్నాడో అంత‌కంటే ఎక్కువ వివాదాల‌తో టార్గెట్ అయ్యాడు  ర‌వి. 

 

 

తర్వాత  శ్రీ‌ముఖి, లాస్య‌ల‌తో ఎఫైర్ అంటూ మ‌రికొన్ని రోజులు వార్త‌ల్లో నిలిచాడు. దానికితోడు బ‌య‌ట కూడా చాలా ర‌ఫ్ అండ్ ట‌ఫ్‌గా ఉంటాడట.. యాంకరింగ్ కొత్తలో లాస్య తో కలిసి కో -యాంకర్ గా చేసాడు.  ఈ టీవీ పెట్టిన గాని వీళ్ళ ఇద్దరు ప్రత్యక్షం అవుతారు. అప్పట్లో వీరిద్దరి మధ్య ఎదో ఉందని వార్తలు దుమారం లేపాయి.. ప్రేక్షకులు కూడా వీళ్ళ జోడి కి మంచి మార్కులు వేశారు. ప్రేమించుకుంటున్నారని అనుకున్నారు.పెళ్లి కూడా చేసుకుంటారని అందరు అనుకున్నారు.. కానీ లాస్య మాత్రం అలాంటివి ఏమి లేవని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పింది.. మేము జస్ట్ స్నేహితులం మాత్రమే.మా ఇద్దరి మధ్య ఇంకా ఏమిలేదని చెప్పింది. తర్వాత మెల్లగా రవి తో నటించడం తగ్గించింది.. ఇప్పుడు పెళ్లి చేసుకుని పండంటి బిడ్డకి జన్మ నిచ్చింది. అక్కడితో మన రవి కధ ఆగలేదు. సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు.లాస్య లేకపోయినా యాంకరింగ్ రంగం లో రాణించాడు.. 

 

 

ఈటీవీ షో లో పటాస్ అనే కామెడి  ప్రోగ్రామ్ ద్వారా బుల్లితెర మీదకి వచ్చాడు. ఈ షోలో రవి కి కో -యాంకర్ గా శ్రీముఖి నటించింది.వీళ్ళ యాంకరింగ్ కి ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యారు.. మళ్ళీ తెరపై వీళ్ళ కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యారు వీళ్లిద్దరు.. ప్రేమించుకుంటున్నారేమో, పెళ్లి కూడా చేసుకుంటున్నారేమో అనే అంతలా పెర్ఫార్మన్స్ చేసారు తెరపై.. కానీ మళ్ళీ కధ మాములే, నో ప్రేమ, నో పెళ్లి, ఓన్లీ ఫ్రెండ్స్ అనేసారు.. పటాస్ నుండి శ్రీముఖి తప్పుకుంది, మెల్లగా రవి కూడా తప్పుకున్నాడు.అసలు విషయం ఏంటంటే రవికి అంతకుముందే పెళ్లి అయిపోయింది. ఒక పాప కూడా పుట్టింది.. ఈటీవీ షో లో "అవును వాళ్లిద్దరూ గొడవపడ్డారు"   ప్రోగ్రామ్ లో రవి వైఫ్ అండ్ కూతురిని అందరికి పరిచయం చేసాడు.తన పాపే తన లోకం అని అందరికి చెప్పాడు.. భార్య కూడా రవి కి సపోర్ట్ గానే మాట్లాడింది. లాస్య, తరవాత శ్రీముఖి, వర్షిణికి, రవికి  మధ్య ఎవో ఎఫ్ఫైర్స్ ఉన్నాయన్న మాటలని కొట్టిపడేసింది. రవిది చిన్న పిల్లాడి మనస్తత్వం అని చెప్పింది.ఏది ఏమయినా రవి ఒక ఇంటివాడిని అందరికి తెలిసిపోయింది. భార్య కూడా రవికి సపోర్ట్ గానే ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: