టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ది సినిమా ఇండస్ట్రీలో పడిలేచిన ప్రస్థానం.. ఒకప్పుడు వరుస హిట్లతో తిరుగులేని డైరెక్టర్ అన్న పేరున్న పూరి తర్వాత వరుస ప్లాపులతో అడ్రస్ లేకుండా వెళ్లిపోయాడు. తర్వాత మళ్లీ ఓ హిట్ కొట్టి లైన్లోకి రావడం.. మళ్లీ పడడం.. మళ్లీ లేవడం పూరికి గత రెండు దశాబ్దాలుగా అలవాటుగానే మారింది. ఇక పూరి టెంపర్‌కు ముందు వరుస ప్లాపుల తర్వాత టెంపర్‌తో హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చాడు. మళ్లీ ఆరు వరుస ప్లాపుల తర్వాత అడ్రస్ లేకుండా పోయాడు.
ఇక రామ్‌తో తీసిన ఇస్మార్ట్ శంకర్ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో మళ్లీ పూరి సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చాడు. ప్రస్తుతం పూరి విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇక పూరి జగన్నాథ్‌కు రాజకీయాలకు లింక్ ఉంది. ఆయన సోదరుడు పెట్ల ఉమాశంకర్ గణేష్ విశాఖ జిల్లా నర్సీపట్నం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. గణేష్ 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి చేతిలో కేవలం 2 వేల ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయినా మొన్న ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో విజయం సాధించారు.
ఈ క్రమంలోనే మీరు రాజకీయాల్లోకి వస్తారా ? అని పూరిని ప్రశ్నిస్తే వాటి గురించి తనకు అస్సలు తెలియదని కుండబద్దలు కొట్టేశారు. సో పూరి ఫ్యామిలీ అంతా వైసీపీలో ఉన్నా .. ఆయన సొంత సోదరుడు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నా పూరి మాత్రం తనకు రాజకీయాలంటే ఎంత మాత్రం సూట్ కాదని చెప్పకనే చెప్పేశారు.