ఏపీలో ఈ సారి జగన్ ను గద్దె దించాలని.. వ్యతిరేక ఓటు చీలద్దనే లక్ష్యంతో టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడి ముమ్మర ప్రచారం చేస్తున్నాయి. పొత్తులో భాగంగా కొన్ని స్థానాల్లో అభ్యర్థుల విషయంలో ఊహించని గందరగోళం నెలకొంది. జనసేన అధినేతకు కూడా ఒకానొక సమయంలో ఊహించని విధంగా నిరసన సెగ తగిలింది. ఏదైతే అది అనుకూంటూ జాబితాను ప్రకటించి ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.


ఓ వైపు నామినేష్ల పర్వం కొనసాగుతుండగా.. కొన్ని చోట్ల కూటమి అభ్యర్థులు ఇంకా తేలడం లేదు. అభ్యర్థుల మార్పు కొనసాగుతూనే ఉంది. కాకపోతే ఇది టీడీపీకి సంబంధించి విషయం కాబట్టి మీడియా పెద్దగా హైలెట్ చేయకపోవచ్చు. అదే జగన్ అయితే ఈ పాటికే రచ్చరచ్చ చేసేదే. ఓటమి భయం కనిపిస్తోంది. అందుకే ముందుగా అభ్యర్థులను ప్రకటించినా వారిని మారస్తున్నారు. ట్రాన్స్ ఫర్ చేస్తున్నారు అంటూ రకరకాల కామెంట్లు వినిపించేవి.


కానీ చంద్రబాబు విషయంలో అంతా సాదాసీదాగా జస్ట్ అభ్యర్థులను మార్చారు అంతే అనే తరహాలో ఇప్పుడు చూపిస్తున్నారు. గెలుపు గుర్రాలను బరిలో దింపేందుకు అంటూ కవరింగ్ వార్తలను రాస్తున్నారు. మొత్తం మీద నామినేషన్ల పర్వం కొనసాగుతున్న క్రమంలో ఎన్నికలకు నాలుగు వారాల సమయం కూడా లేని ఇంత తక్కువ సమయంలో అభ్యర్థుల మార్పు టీడీపీకి లాభం చేకూరస్తుందా లేదా అంటే చూడాలి.


ఇంకా టీడీపీకి ఆ పార్టీ అభ్యర్థులపై నమ్మకం కలగలేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొత్తం చంద్రబాబు ఐదు చోట్ల అభ్యర్థులను మార్చుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరి, ఉండి టికెట్ రఘురామకృష్ణం రాజు, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర టికెట్ ను మాజీ ఎమ్మెల్యే ఈశ్వరన్న కుమారుడు డాక్టర్ సునీల్ కుమార్ పేరును ఇంతకు మందు ప్రకటించి ప్రస్తుతం ఎమ్మెస్ రాజుకు కేటాయించారు. మాడుగుల నుంచి బండారు సత్యనారాయణకు అవకాశం కల్పించారు. వెంకటగిరి నుంచి రామకృష్ణకు బీఫాం ఇచ్చారు. మరీ ఈ మార్పులు  ఏ మేరకు ప్రభావం చూపుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: