మెగాస్టార్ చిరంజీవి మూడేళ్ళ క్రితం ఖైదీ నెంబర్ 150 సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు హీరోగా రిఎంట్రీ ఇచ్చారు.గత ఏడాది సైరా నరసింహారెడ్డి సినిమాతో ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో హీరోగా నటిస్తున్న మెగాస్టార్, ఆ సినిమా తప్పకుండా మంచి హిట్ కొట్టాలని ఎంతో కసిగా పని చేస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ ల పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా మిగతా షూటింగ్ ని లాక్ డౌన్ అనంతరం కొనసాగించనున్నారు. 

 

ఇక మొదటి నుండి కూడా తన సినిమా సెట్ లోని వారందరితో ఎంతో కలిసిపోయి ప్రతి ఒక్కరిని తన వారుగా భావించి ఆదరించే మంచి మనసున్న మెగాస్టార్ చిరంజీవికి తన తల్లి అంజనాదేవి, తండ్రి కొణిదెల వెంకట్రావు అంటే అమితమైన ప్రేమ, అభిమానము. 2007, డిసెంబర్ 24న తండ్రి వెంకట్రావు హఠాన్మరణంతో మెగాస్టార్ చిరంజీవి సహా ఆయన కుటుంబ సభ్యులు అందరూ కూడా పూర్తి విషాదంలో మునిగిపోయారు. ఎన్నో ఏళ్ల పాటు తన కానిస్టేబుల్ వృత్తికి న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో నాన్న ఎప్పుడూ కూడా తన ఆరోగ్యాన్ని లక్ష్య పెట్టేవారు కాదని, ఆ విధంగా తాను జీవితంలో ఎంతో శ్రమించి, శ్రమనే ఆయుధంగా చేసుకుని ముందుకు నడవమని మాకు హిత బోధ చేసేవారని, ఎటుంవంటి నాన్న ఒక్కసారిగా మరణించడం నిజంగా నా గుండెని బద్దలు చేసిందని పలు సందర్భాల్లో మెగాస్టార్ చిరంజీవి చెప్పడం జరిగింది. 

 

ఇక 2008లో సొంతంగా ప్రజారాజ్యం పేరుతో పార్టీని నెలకొల్పిన మెగాస్టార్ చిరంజీవి, మొదట్లో పార్టీని ఒకింత బలంగానే ప్రజల్లోకి తీసుకువెళ్లారు. అయితేఆ ఆ తరువాత 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీకి కేవలం 18 సీట్లు మాత్రమే లభించి మెగాస్టార్ రాజకీయ జీవితాన్ని కొంత ఇబ్బందుల్లో పడవేసింది. కాగా తాను, మన అని నమ్మిన వారే తనకు వెన్నపోటు పొడిచారని, రాజకీయం అనే పదానికి నిజమైన అర్ధం కుట్ర అని ఆ తరువాతే అర్ధమయిందని, నమ్మిన వారే తనను ఆ విధంగా మోసం చేయడం తనను ఎంతో కలిచివేసిందని ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి చెప్తూ ఉంటారు. కాగా ప్రజారాజ్యం పార్టీ ని 2011లో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన విషయం తెలిసిందే...!! 

మరింత సమాచారం తెలుసుకోండి: