ఒక వైపు ఎమ్మెల్యేగా.. మరొవైపు జబర్ధస్త్, బతుకు జట్కా బండి షోలకి జడ్జిగా తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు రోజా. తెలుగు చిత్ర పరిశ్రమకు నటిగా పరిచమయైన ఆమె ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. తెలుగు, తమిళంలో ఎక్కువ సినిమాలు చేసిన రోజా.. మలయాళం, కన్నడలో ఓ మోస్తరు చిత్రాల్లో నటించారు. కానీ రోజా తన కెరీర్ మొత్తంలో కేవలం ఒకే ఒక్క హిందీ సినిమాలో నటించడం విశేషం.

తెలుగు ఇండస్ట్రీలో ‘ప్రేమ తపస్సు’ చిత్రం ద్వారా పరిచయమైన నటి రోజా.. ‘సర్పయాగం’ సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్నారు. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణతో నటించిన ‘భైరవ ద్వీపం’ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయారు. స్టార్ హీరోల సరసన నటిస్తూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్నారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో అప్పట్లో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు ఎక్కవగా చేసేది హీరోయిన్ విజయశాంతి. ఆమె తర్వాత లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో నటించింది రోజానే. హీరోయిన్ గా మంచి పేరు, గుర్తింపు సంపాదించుకున్న రోజా తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లో అడుగులు వేశారు. రెండు సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీ పార్టీలో చేరి మూడోసారి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పట్లో ఆమె ప్రాతినిథ్యం వహించిన వైసీపీ అధికారంలో రాకపోవడంతో అందరూ ఆమెను ఐరన్ లెగ్ గా భావించేవారు. కానీ ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు వైసీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో భారీ మెజార్టీతో గెలుపొందింది.

రాజకీయాల్లో ఓడి గెలిచారు రోజా. తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రోజాది ఒక రికార్డనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆమె ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఏపీఐఐసీ చైర్మగా క్యాబినేట్ హోదాను దక్కించుకున్నారు. రాజకీయాలు పక్కన పెడితే అప్పట్లో రోజా హిందీలో కేవలం ఒక్క సినిమాను మాత్రమే నటించారు. మహేష్ భట్ దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మాణంలో చిరంజీవి హీరోగా నటించిన ‘ది జెంటిల్ మెన్’ సినిమాలో ఐటెం సాంగ్ లో మెరిసారు రోజా. ఈ సినిమా తెలుగు, తమిళంలో దర్శకుడు శంకర్, హీరో అర్జున్ నటించిన ‘జెంటిల్ మెన్’ సినిమాకు రీమేక్. తెలుగులో ప్రభుదేవా కొరియోగ్రాఫ్ చేసిన ‘చికుబుకు రైలే’ పాటకు హిందీలో చిరంజీవి స్టెప్పులు వేశారు. సౌత్ లో నటి గౌతమి ఐటెం సాంగ్ చేస్తే.. హిందీలో రోజా ఆ ఐటం సాంగ్ లో చిందేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: