తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో సూర్య గురించి తెలియని వారంటూ ఉండరు. తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు సూర్య. సూర్య నటించిన తాజా చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’. ఈ సినిమాని సుధా కొంగర దర్శకత్వంలో చిత్రీకరించారు. ఇక ఈ సినిమా ఇప్పుడు ఆస్కార్ రేసులో నిలిచింది.

అయితే ఈ సినిమాను దేశంలో లాక్ డౌన్ నేపథ్యంలో థియేటర్లు తెరుచుకోకపోవడంతో ఓటీటీ ద్వారా విడుదలైంది. ఇక సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాపై విమర్శకులు ప్రశంసలు కురిపించారు. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జి.ఆర్.గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సుధా కొంగర టేకింగ్, సూర్య నటన సినిమాను ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాయి. సినిమా చూసిన వారందరినీ భావోద్వేగానికి గురిచేసింది.

ఈ చిత్రంతో సూర్య ఖాతాలో మరొక మంచి సినిమా చేరగా దర్శకురాలిగా సుధా కొంగర ప్రతిభ అందరికీ తెలిసింది. తమిళ సినీ ఇండస్ట్రీ గర్వించదగిన సినిమాగా ఈ చిత్రం నిలిచింది. తాజాగా సినిమాకు మరొక గొప్ప గౌరవం దక్కింది. సినిమా ఆస్కార్ రేసులో నిలిచింది. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, బెస్ట్ డైరెక్షన్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ లాంటి కేటగిరీల్లో ఆస్కార్ బరికి ఎంపికైంది. అంతేకాదు అకాడమీ స్క్రీనింగ్ రూమ్లో మంగళవారం ఈ చిత్రాన్ని ప్రదర్శించారని కూడ సమాచారం. మొత్తానికి సినిమాకు మంచి గుర్తింపే లభిస్తోంది.

ఇక తెలుగు వ్యక్తి సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమా రెవెన్యూ పరంగానే కాకుండా విమర్శకుల ప్రశంసలు సైతం పొందింది. 2020కి గానూ ఓటీటీల్లో అత్యధిక వీక్షణలో దేశంలోనే టాప్ 2లో నిలిచింది. కరోనా నేపథ్యంలో ఆస్కార్ నిబంధనలను సడలిస్తూ.. ఓటీటీల్లో రిలీజైన సినిమాలను కూడా నామినేషన్లకు స్వీకరించారు. ఎయిర్ డెక్కన్ అధినేత కెప్టెన్ గోపీనాధ్ నిజజీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. తెలుగులో ‘ఆకాశమే నీ హద్దురా’ గా విడుదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: