ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి పేరు ఇప్పుడు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతోంది.. గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా సినిమాలో ఓ చిన్న అతిథిగల్ పాత్రలో మెరిసిన ఈ హీరో లేటెస్ట్ గా వచ్చిన ఉప్పెన సినిమాతో ఫుల్ లెన్త్ రోల్ లో తన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు.. ఇక ఈ సినిమా విజయ్ సేతుపతి కి టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ని తీసుకు వచ్చింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోయిన్ కృతిశెట్టి కి తండ్రి పాత్రలో నటించాడు. ఈ పాత్రలో విజయ్ సేతుపతి జీవించాడు. ఇండస్ట్రీలో ప్రముఖుల తో పాటు విమర్శకుల నుంచి గొప్ప ప్రశంసలు అందుకుంటున్నాడు.

అందుకే టాలీవుడ్ లో విజయ్ సేతుపతికి ప్రత్యేకంగా పాత్రలు రాస్తున్నారు దర్శక, రచయితలు.నిర్మాతలు కూడా విజయ్ సేతుపతి డేట్స్ కోసం క్యూ కట్టడమే కాదు భారీగా అడ్వాన్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఈ అవకాశాన్ని మరొక నటుడైతే ఎంత మాత్రం వదులుకోవడానికి ఇష్టపడడు. కాని విజయ్ సేతుపతి మాత్రం ఇప్పుడు వస్తున్న అవకాశాలన్నిటిని సున్నితంగా తిరస్కరిస్తున్నాడట. రెమ్యూనరేషన్ భారీగా ఇస్తానని చెబుతున్న నో అని క్రేజీ ప్రాజెక్ట్స్ ని రిజక్ట్ చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు.అయితే ఇలా విజయ్ సేతుపతి క్రేజీ ప్రాజెక్ట్స్ ని రిజక్ట్ చేసి నో చెప్పడానికి కారణం ఆయన డైరీ ఖాళీ లేకపోవడమే అని తెలుస్తోంది.

 అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప సినిమా నుంచి కూడా డేట్స్ సమస్య వల్లే తప్పుకున్నాడు. వచ్చే రెండేళ్ళ వరకు విజయ్ సేతుపతి పలు ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్నాడట. కొత్త ప్రాజెక్ట్స్ ఇప్పుడు డేట్స్ సర్దుబాటు చేసే పరిస్థితిలో లేడని .. అందుకే కొత్త ప్రాజెక్ట్స్ ఒప్పుకోవడం లేదని అంటున్నారు. ఇక బాలీవుడ్ లో అమీర్ ఖాన్ నటిస్తున్న లాల్ సింగ్ చద్దా అన్న సినిమా నుంచి క్రియేటివ్ డిఫ్రెన్స్ వచ్చి తప్పుకున్నాడు..అలావిజయ్ సేతుపతి డేట్స్ ఖాళీ లేక కొత్తగా వస్తున్న ఆఫర్లను రిజెక్ట్ చేస్తున్నాడట...!!

మరింత సమాచారం తెలుసుకోండి: