తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా ఒకే కుటుంబం నుండి ఎంతో మంది హీరోలు సినీ పరిశ్రమకు పరిచయమైయ్యారు. ఇక హీరోయిన్ చెల్లెలు కూడా చిత్ర పరిశ్రమకు పరిచయమైయ్యారు. జీవిత తెలుగులో ఎంత పెద్ద హీరోయిన్ అయిందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజశేఖర్ తో అంకుశ, తలంబ్రాలు లాంటి సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు సాధించుకున్నారు.

తలంబ్రాలు సినిమాలో కళ్యాణ్ చక్రవర్తి చెల్లెలిగా చేయమని అడిగాడు కానీ తను పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. జీవిత కూడా తనకి నటన మీద అ పెద్దగా ఇంట్రెస్ట్ లేదు సార్ అని చెప్పినప్పటికీ శ్యాం ప్రసాద్ రెడ్డి వినకుండా మొండిగా పట్టుపట్టి ఆ సినిమాలో కళ్యాణ్ చక్రవర్తి చెల్లెలుగా నటింపచేశాడు.ఆ తర్వాత కూడా తను కొన్ని సినిమాలు చేసినప్పటికీ అవి రిలీజ్ కాలేదు, దాంతో సినిమాలు మనకు పెద్దగా అచ్చిరావు అని అనుకొని పెళ్లిచేసుకుని లైఫ్ లో సెటిల్ అయ్యారు.

కాజల్ లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైయ్యారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది అయితే కాజల్ సక్సెస్ కావడంతో తన చెల్లి అయిన నిషా అగర్వాల్ కూడా వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన ఏమైంది ఈ వేళ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది ఆ సినిమా మంచి సక్సెస్ సాధించింది. తన కెరియర్ పెద్దగా సాగలేదని చెప్పాలి దాంతో చేసేదేం లేక పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయ్యారు.

ఆర్తి అగర్వాల్ నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. తరుణ్,ఉదయ్ కిరణ్, మహేష్ బాబు, రవితేజ ప్రభాస్, నాగార్జున,బాలకృష్ణ, వెంకటేష్ లాంటి హీరోల పక్కన నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే అల్లు అర్జున్ హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన గంగోత్రి సినిమాలో ఆర్తి అగర్వాల్ చెల్లె అయిన అదితి అగర్వాల్ హీరోయిన్ గా పరిచయం అయింది.  కొడుకు సినిమాలో హీరోయిన్ గా నటించింది ఆ సినిమా ప్లాప్ అవడంతో తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు.

తెలుగు చిత్ర పరిశ్రమలో నగ్మా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవితో ఘరానా మొగుడు సినిమా లో నటించి హీరోయిన్ గానే కాదు నటిగా కూడా మంచి గుర్తింపు సాధించారు. స్టార్ హీరోయిన్ అయిన తర్వాత ఆమె చెల్లె అయిన జ్యోతిక కూడా సినిమాల్లోకి వచ్చి మంచి గుర్తింపును సాధించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: