దేశంలో కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో వేరే చెప్పక్కర్లేదు. రోజూ లక్షల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలు. ఆక్సిజన్ అందక, బెడ్లు దొరక్క, సరైన వైద్యం లభించక.. ఇలా అనేక కారణాలతో అనేకమంది కరోనా బాధితులు కుటుంబ సభ్యుల కళ్లముందే ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే అనేకమంది సెలబ్రిటీలు తమ వంతుగా పేద ప్రజలకు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. ఈ జాబితాలో ఇప్పుడు టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కూడా చేరాడు. ఈ కష్ట కాలంలో శాయశక్తులా కరోనా బాధితులకు తన వంతు సాయం అందిస్తున్నాడు.

కరోనా బాధితుల్లో రక్తం అవసరం ఉన్నవారికి వెంటనే బ్లడ్ బ్యాంకుల నుంచి రక్తం అందించడం, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారికి తన వంతుగా కొంత మొత్తాన్ని అందించడం, అలాగే ఆసుపత్రుల్లో ఉన్న పేషెంట్లకు సాయం చేయడం వంటి అనేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. అంతేకాకుండా ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్లు, అవసరమైన ఔషధాలు వంటి వాటిని కూడా తన శక్తిమేర సమకూరుస్తున్నాడు. అంతేకాకుండా తన సాయం ఎవరికి కావాల్సి వచ్చినా.. వెంటనే సోషల్ మీడియా ద్వారా అందుబాటులో ఉంటున్నాడు.

ఇదిలా ఉంటే నిఖిల్ ప్రస్తుతం కార్తికేయ 2 సినిమాతో పాటు మరికొన్ని సినిమాల్లో చేస్తున్నాడు. ఇంకా కొన్ని కథలు వింటున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్‌లన్నీ ఆగిపోయాయి. దీంతో నిఖిల్ ఇంటికే పరిమితమయ్యాడు. ఈ క్రమంలోనే ఇటీవల దేశంలోని కరోనా పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ వీడియో షేర్ చేశాడు. దానికి తోడు ఇప్పుడు నేరుగా సాయం చేయడానికి రంగం లోకి దిగాడు.

కాగా.. టాలీవుడ్ నుంచి ఇప్పటికే అనేక మంది సెలబ్రిటీలు కరోనా బాధితులకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ప్రధానంగా సినీ ఇండస్ట్రీలో ఉపాధి కోల్పోవడంతో ఇబ్బందులు పడుతున్న అనేకమందిని ఆర్థికంగా ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, ప్రభాస్ వంటి వారంతా తమవంతుగా సాయం అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: