కొన్ని సినిమాలు మాత్రం కొందరికే నచ్చుతాయి.. అందుకే కొన్ని రోజులకే ఆ సినిమాలు అడ్రెస్ లేకుండా పోతున్నాయి.. కానీ కుటుంబ కథా చిత్రాలు మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి. ఆందుకే వాటికి ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు గడిచిన క్రేజ్ తగ్గదు. అలాంటి సినిమాలు వేళ్ళ మీద ఉన్నాయి. వాటిలో ఒకటి "శతమానంభవతి".. సతీష్ వేగేశ్న దర్శకత్వం లో 2017 లో విడుదలైన తెలుగు సినిమా. ఇందులో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్, జయసుధ ప్రధాన పాత్రలు పోషించారు.



తల్లిని చూడ‌టానికి రాని పిల్ల‌ల‌ కోసం రాజుగారు బాధ ప‌డుతూ ఉంటారు. ఓ ప‌థ‌కం వేసి త‌న పిల్ల‌ల‌ను సంక్రాంతికి వ‌చ్చేలా చేస్తారు రాజుగారు. ఇంటి కి వ‌చ్చిన కొడుకులు, కూతుళ్ళ‌ తో స‌ర‌దాగా సంక్రాంతి సంబ‌రాలు జ‌రుపుకుంటూ ఉంటారు. ఈ క్ర‌మంలో రాజుగారి మ‌న‌వ‌రాలు నిత్యా, రాజు తో ప్రేమ‌లో ప‌డుతుంది. ఈలోపు రాజు గారి వేసిన ప‌థకం జాన‌క‌మ్మ‌ కు తెలియ‌డం  లో కుటుంబం లో విబేదాలు వ‌స్తాయి. అస‌లు రాజుగారు వేసిన ప‌థకం ఏమిటి? అనే విష‌యం మిగిలిన కథ.. 



డబ్బుల మోజులో పడి కుటుంబాన్ని , సొంత ఊరిని వదిలేసిన చాలా మందికి ఈ సినిమా కనివిప్పు అవుతుంది. అంతగా అన్నీ ఎమోషన్స్ తో ఈ సినిమా ను చిత్రీకరించారు. ముఖ్యంగా ఈ సినిమా లో శర్వానంద్ పాత్ర ఈ సినిమా కు హైలెట్ అవుతుంది.. ఇకపోతే కథకు తగ్గట్లు సాగిన పాటలు.. జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దాంతో సినిమా సూపర్ హిట్ అయింది.. సినిమాకు 8 కోట్లు ఖర్చు పెడితే అంతకు మూడు రేట్లు సినిమా కలెక్షన్స్ ను సొంతం చేసుంది. అవార్డుల ను, వాటి తో పాటుగా ప్రశంసలు కూడా అందుకుంది.. సినిమా వచ్చి ఐదు ఏళ్లు అయిన కూడా అంతే క్రేజ్ ఉండటం విశేషం.. 

మరింత సమాచారం తెలుసుకోండి: