మెగాస్టార్ చిరంజీవి మొదటగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి ఎంతో కృషి చేశాడు. ఇక ఏఎన్ఆర్, ఎన్టీఆర్, కృష్ణ వంటి అగ్ర హీరోలు నటిస్తున్నప్పుడే చిరంజీవి కూడా సినిమాల వైపు అడుగులు వేశాడు. మొదటిసారిగా పునాదిరాళ్ళు సినిమాతో ఎంట్రీ ఇచ్చి చిరంజీవి, ఆ తర్వాత తన నటనతో, డాన్స్ తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. అలా పేరు సంపాదించిన చిరంజీవి ఒకనొక సమయంలో ఒక ఏడాది పాటు సినీ ఇండస్ట్రీ వైపు తిరిగి చూడలేదు. అది ఎందుకో తెలుసుకుందాం.


చిరంజీవి 1978 నుంచి 1983 వరకు దాదాపుగా 60 సినిమాలలో నటించారు.1983 లో విడుదలైన ఖైదీ సినిమాతో స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిపోయాడు చిరంజీవి. ఇక ఆ తర్వాత పసివాడి ప్రాణం, జగదేకవీరుడు అతిలోకసుందరి, వంటి అనేక సినిమాలు తీసి హిట్ స్టార్ గా దూసుకుపోతున్న సమయంలో..1994-95 లో ఒకేసారి 4,5 సినిమాలు వరుస ప్లాపులు చవిచూశాయి. దీంతో  ప్రొడ్యూసర్స్ కు భారీ నష్టాలను తెచ్చాయి.

ఇక 1996 లో ఒక సంవత్సరం వచ్చేసరికి ఈయన ఒక్క సినిమాలో కూడా నటించడం లేదు. దానికి గల కారణం వరుస సినిమాలతో ఫ్లాప్ లో ఉన్నందువలన ఆచితూచి అడుగులు వేయాల్సి వచ్చింది కథల విషయంలో. దాంతో ఆ ఏడాది అంతా ఒక్క సినిమాలో కూడా నటించడం లేదు. ఇక ఆ తర్వాత 1997 లో ముత్యాల సుబ్బయ్య తో కలిసి"హిట్లర్" సినిమా  తీశారు . ఆ తర్వాత సినిమాలన్నీ భారీ హిట్లతో దూసుకుపోయాయి.

ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు కథల విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తూ, తనదైన స్టైల్ లో మెగాస్టార్ అనిపించుకున్నాడు చిరంజీవి. ప్రస్తుతం ఈయన ఆచార్య సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఇక ఆచార్య సినిమా పూర్తవ్వగానే, లూసిఫర్ సినిమా షూటింగ్ లోకి అడుగు పెట్టబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి.


మరింత సమాచారం తెలుసుకోండి: