తెలుగు కుర్ర హీరోలలో బాగా పాపులారిటీ ఉన్న హీరోలలో నాగ శౌర్య ఒకరు. ఇప్పటికే ఊహలు గుసగుసలాడే, ఛలో, అశ్వద్ధామ వంటి పలు చిత్రాలతో నటించిన నాగ శౌర్య తెలుగు ప్రేక్షకులను అలరించాడు.  నాగశౌర్య మరికొన్ని సినిమాల్లో నటిస్తూ తన ఫామ్ ను కంటిన్యూ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. నాగ శౌర్య ప్రస్తుతం హీరోగా నటిస్తున్న సినిమా 'వరుడు కావలెను'. ఈ సినిమాను ఫ్యామిలీ మొత్తం చూసే విధంగా కుటుంబ కథతో తెరకెక్కిస్తున్నారు. 'వరుడు కావలెను' సినిమా పై నాగశౌర్య కూడా బాగా అంచనాలు పెట్టుకొని ఉన్నాడు. ఈ సినిమాలో నాగ శౌర్య కు జంటగా పెళ్లిచూపులు కథానాయక రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా నుండి ఇప్పటికే కొన్ని ప్రచార చిత్రాలు, టీజర్, దిగు దిగు నాగ అనే ఒక పాటను కూడా చిత్రం విడుదల చేసింది.

ఈ పాటకు సంబంధించి చిత్రబృందం కొన్ని ట్రోలింగ్ ను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు యువ సంగీత దర్శకుడు తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన అప్డేట్ చిత్రబృందం బయటకు వదిలారు.  కొన్ని రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్ లో నాగశౌర్య, రీతూవర్మ మధ్య కెమిస్ట్రీకి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇలా టీజర్ లో మంచి కెమిస్ట్రీ ని పండించిన నాగశౌర్య, రీతూవర్మ లను వెండి తెరపై చూడాలని చాలా మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. వారి ఎదురు చూపులకు కళ్లెం వేసేలా చిత్రబృందం విడుదల తేదీని ప్రకటించింది. ఈ సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్ 15వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం అఫీషియల్గా ప్రకటించింది. మరి ఈ మూవీతో నాగసౌర్య ఎలాంటి విజయాన్ని అందుకుంటాడు తెలియాలంటే సినిమా విడుదల తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: